వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో కరోనా: 2కోట్లు దాటేసింది -ఒక్కరోజులోనే 3,449 మంది బలి -కొత్తగా 3.57 లక్షల కేసులు

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్నది. గడిచిన మూడు రోజులుగా రోజువారీ కేసులు స్వల్పంగా తగ్గినట్లున్నా, కొవిడ్ మరణాలు మాత్రం కంట్రోల్ లోకి రాలేదు. కొవిడ్ కేసులకు సంబంధించి ఇప్పటికే పలు రికార్డులను అధిగమించిన భారత్ ఇప్పుడు 2కోట్ల మార్కును కూడా దాటేసింది. ఢిల్లీ సహా చాలా చోట్ల ఆక్సిజన్ లేక చనిపోతున్నవారి సంఖ్యా పెరుగుతూవస్తోంది...

కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,57,229 పాజిటివ్‌ కేసులు, 3,449 మరణాలు నమోదయ్యాయి. తాజా గణాంకాలతో కలిపి మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 2,02,82,833కు, మరణాల సంఖ్య 2,22,408కు పెరిగింది. గతవారం ఒకే రోజు 4లక్షలకు దగ్గరగా వెళ్లిన రోజువారీ కేసులు గడిచిన మూడు రోజులుగా క్రమంగా తగ్గుతూ 3.57లక్షలకు చేరింది.

భారత్‌లో ఫైజర్ వ్యాక్సిన్: సంచలన అడుగు -అతిపెద్ద కొవిడ్ సాయం -మోదీ సర్కార్ తాత్సారం, ఎవరికోసం?భారత్‌లో ఫైజర్ వ్యాక్సిన్: సంచలన అడుగు -అతిపెద్ద కొవిడ్ సాయం -మోదీ సర్కార్ తాత్సారం, ఎవరికోసం?

Indias Covid tally past 2-crore mark with 3.57 lakh new cases, 3,449 deaths in last 24hrs

నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3,20,289 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. తద్వారా మొత్తం రికవరీల సంఖ్య 1,66,13,292కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 29.33 కోట్ల పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ టీకాలు అందించే కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టినప్పటికీ, వ్యాక్సిన్ల కొరత కారణంగా ప్రక్రియ ముందుకుసాగడంలేదు. ఇప్పటి వరకు మొత్తం 15,89,32,921 డోసుల టీకాలు పంపిణీ అయినట్లు కేంద్రం తెలిపింది. కాగా,

కేసీఆర్‌..చావునైనా భరిస్తా, నిన్ను క్షమించ -వైఎస్సార్‌కే భయపడలే, రాజీనామా చేస్తా -గుట్టు విప్పిన ఈటల రాజేందర్కేసీఆర్‌..చావునైనా భరిస్తా, నిన్ను క్షమించ -వైఎస్సార్‌కే భయపడలే, రాజీనామా చేస్తా -గుట్టు విప్పిన ఈటల రాజేందర్

Recommended Video

Kamal Haasan, Kushboo Had Lost In Tamilnadu Assembly Elections 2021 | Oneindia Telugu

కొన్ని రాష్ట్రాల్లో ఊహించిన దాని కన్నా చాలా ముందే కోవిడ్‌ కేసుల్లో పెరుగుదల నిలిచిపోయిందని, రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలిపింది. తెలంగాణ, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పంజాబ్‌ సహా 13 రాష్ట్రాల్లో రోజువారీగా వస్తున్న కొత్త కేసుల్లో స్థిరీకరణ కనిపిస్తోం దని సోమవారం ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, పశ్చిమబెంగా ల్, కర్నాటక, కేరళ తదితర 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులున్నాయన్నారు.

English summary
India on Tuesday recorded over 3.57 lakh fresh Covid-19 cases and 3,449 deaths over the past 24 hours. The country's Covid-19 case tally has now breached the 2-crore mark. With the 3,57,229 fresh cases in 24 hours, India's total case tally has crossed the 2-crore mark and reached 2,02,82,833. The total number of active Covid-19 cases in the country now stands at 34,47,133.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X