గ్లోబల్ లీడర్, జమిలితో మేలు: రాష్ట్రపతి ద్రౌపది రిపబ్లిక్ డే స్పీచ్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైందని పేర్కొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వెచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయన్నారు. దేశం మొత్తం గర్వించదగిన సందర్భమని అన్నారు. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలన్నారు. ఈ ఏడాది బిర్సా మొండా 150వ జయంతిని జరుపుకున్నామన్నారు. వెలుగులోకిరాని మరికొందరు ధైర్యవంతులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

India s leadership in the world President Draupadi Murmu s Republic Day speech

మురుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మార్చుకున్నామని రాష్ట్రపతి గుర్తు చేశారు. ఈ ఏడాది కొత్త చట్టాలు రూపొందించి అమల్లోకి తెచ్చామని వివరించారు. గత 75 ఏళ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్నది రాజ్యాంగమేనని.. వలసవాద ఆలోచనా విధానాన్ని మార్చేందుకు దేశం సమిష్టి ప్రయత్నాలను చూస్తోందన్నారు.

ఇక, జమిలి ఎన్నికలు సుపరిపాలన అందించేందుకు ఒక మార్గమని అన్నారు. పాలనలో స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. వనరుల మళ్లింపు తగ్గించవచ్చని వివరించారు. అంతేగాక, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చన్నవారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) గత కొన్నేళ్లుగా గొప్ప మైలురాళ్లను అధిగమించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+