ఇండిగో మరో బంపర్ ఆఫర్: మాన్‌సూన్ స్పెషల్.. టికెట్ ధర ఎంతంటే!

Subscribe to Oneindia Telugu

చెన్నై: ఇటీవలి కాలంలో విమాన టికెట్లు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తుండటం సామాన్యులను సైతం వాయు మార్గంలో విహరించేలా చేస్తోంది. తాజాగా ఇండిగో విమానయాన సంస్థ మాన్ సూన్ ఆఫర్ పేరిట మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.

మాన్ సూన్ స్పెషల్ సేల్ ఆఫర్ కింద కేవలం రూ.899కే టికెట్లను విక్రయిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. జూన్12-14మధ్యలో టికెట్లను బుక్ చేసుకునేవారికి మాత్రమే ఈ చౌకధరలు వర్తిస్తాయి. అది కూడా ఇండిగో నిర్దేశించిన మార్గాల్లోనే ఈ చౌకధరలు అందుబాటులో ఉంటాయి.

IndiGo announces monsoon sale, offering special airfare Rs 899 onwards

ఈ ఆఫర్ కింద టికెట్స్ బుక్ చేసుకున్నవారు జూలై1నుంచి సెప్టెంబర్ 30వరకు నిర్దేశిత మార్గాల్లో విమాన ప్రయాణ: చేయవచ్చు. హైదరాబాద్-ముంబై, ముంబై-గోవా, జమ్ము-అమృత్, కోల్‌కతా -అగర్తలా, ఢిల్లీ-కోయంబత్తూర్, గోవా-చెన్నై వంటి మార్గాల్లో ఈ ఆఫర్ ఉంటుందని ఇండిగో ప్రకటించింది.

అయితే ఈ స్పెషల్ ధరల ఆఫర్ ఫస్ట్-కమ్-ఫస్ట్ బేసిస్ లో ఉంటుందని ఇండిగో వర్గాలు తెలిపాయి. ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో.. వారికే ఈ చౌకధరలు అందుబాటులో ఉండనున్నాయి. ఒకసారి టికెట్ బుక్ చేసుకున్నవారు తిరిగి రీఫండ్ చేయడం కుదరదు.

గతంలో సమ్మర్ స్పెషల్ సేల్ కింద పెట్టిన ఆఫర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మరోసారి ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు సంస్థ చెబుతోంది. ఇక ఇదే మాన్ సూన్ ఆఫర్ కింద చెన్నై సిటీతో కనెక్ట్ అయ్యే విమాన మార్గాలకు టికెట్ రేట్లు ఈవిధంగా ఉన్నాయి. ముంబై-చెన్నై-రూ.1999, ఢిల్లీ-చెన్నై-రూ.3399, బెంగళూరు-చెన్నై-రూ.1199గా రేట్లను నిర్ణయించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Low-cost airline IndiGo has announced a three-day monsoon special sale across its 39 domestic destinations effective from June 12 to 14, 2017 for travel between July 1 and September 30.
Please Wait while comments are loading...