రూ.1212కే: 12లక్షల సీట్లపై ఇండిగో ఎయిర్‌లైన్స్ భారీ ఆఫర్, అదేదారిలో ఎయిర్ ఏషియా
Recommended Video

ముంబై: బడ్జెట్ ప్రయాణికులకు ఎంతో దగ్గరైన విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ తన12వ వార్షికోత్సవం సందర్భంగా మరోసారి భారీ ఆఫర్లను ప్రకటించింది. దాదాపు 12లక్షల సీట్లను అత్యంత చవకగా ప్రయాణికులకు అందించేందుకు నాలుగు రోజుల మెగాసేల్‌ను ఆరంభించింది.
ప్రారంభ ధర రూ.1,212తో 2018 జూలై 25నుంచి 2019 మార్చి 30 వరకూ చేసే ప్రయాణాలకుగాను నేటి నుంచి నుంచి జులై 13వ తేదీ బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. దాదాపు 57 ప్రధాన నగరాలను కలుపుతూ దేశీయంగా, అంతర్జాతీయంగా ఇండిగో అందిస్తున్న సేవలన్నిటికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

సంస్థ అధికార ప్రతినిధి విలియమ్ బౌల్టర్ మాట్లాడుతూ.. 'ఇండిగో ఎయిర్‌లైన్స్ స్ధాపించి 2018 ఆగస్టు 4కి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఆఫర్ ఇస్తున్నాం. ప్రారంభ ధర రూ.1,212 నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు' అని తెలిపారు.
'మొత్తం 12 లక్షల సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచాం. ఇండిగో సేవలందిస్తున్న అన్ని మార్గాల్లో ప్రయాణించేవారు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చ' అని తెలిపారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో బుకింగ్ చేసుకునేవారు క్యాష్‌బాక్ కూడా పొందవచ్చని ప్రకటించింది. దీనికి కనీసం రూ.3000తో బుకింగ్ చేసుకోవాలని తెలిపారు.
ఇది ఇలా ఉండగా, ఎయిర్ ఏషియా కూడా పలు ఆఫర్లను ప్రకటించింది. ఎయిర్ ఏషియా ''లో ఫేర్ మ్యాడ్ నెస్ ''పేరిట సరికొత్త ఆఫర్ తెరపైకి తెచ్చింది. కేవలం రూ. 999కే విమాన ప్రయాణం అందిస్తోంది. ఈ ఆఫర్ డొమెస్టిక్ విమాన ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది.
అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.3399 మొదలుకొని టిక్కెట్ల ధరలు ప్రారంభం అవుతున్నాయి. గోవా-హైదారాబాద్ మధ్య 9 జులై నుంచి జనవరి 31,2019 వరకూ చేసే ప్రయాణాలకు టిక్కట్ల ధరలను రూ.1999గా నిర్ణయించింది. జులై 15 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జెట్ ఎయిర్‌వేస్ కూడా ప్రత్యేక మార్గాల్లో రూ.1000 నుంచి రూ.2500 వరకు తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది.












Click it and Unblock the Notifications