ప్రయాణికులకు గుడ్ న్యూస్: వందే భారత్ సర్వీస్ పొడిగింపు
భోపాల్: చెన్నై: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 33 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
ఈ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరతగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ- మరింత వినూత్నంగా తీర్చిదిద్దబోతోంది. ఇందులో భాగంగా కొత్తగా స్లీపర్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రానుంది. 2024 ఫిబ్రవరి నాటికి ఈ స్లీపర్ వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి.
ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని వందే భారత్ రైలు సర్వీసులను పొడిగించడానికి ప్రాధాన్యత ఇస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఇందులో భాగంగా కొన్ని రైలు సర్వీసులను ఎంపిక చేసింది. వాటిని దశలవారీగా అమలులోకి తీసుకుని రానుంది. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను రూపొందించింది.
ఇందులో భాగంగా.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్- భోపాల్ మధ్య తిరుగాడే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను పొడిగించింది. దీన్ని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు పొడిగించింది. ప్రయాణికుల నుంచి భారీగా అందుతున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు భోపాల్ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు.
ఇండోర్ నుంచి బయలుదేరే నంబర్ 20911 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ వరకు వెళ్తుంది. 5 గంటల 10 నిమిషాల వ్యవధిలో ఇది నాగ్‌పూర్‌కు చేరుకుంటుంది. ప్రతి రోజూ తెల్లవారు జామున 6:10 నిమిషాలకు ఇండోర్ నుంచి బయలుదేరే ఈ రైలు 11:20 నిమిషాలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటుంది. ఇటార్సీ, ఉజ్జయినీ, భోపాల్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
ప్రతిరోజూ మధ్యాహ్నం 3: 20 నిమిషాలకు నాగ్‌పూర్ నుంచి బయలుదేరే నంబర్ 20912 వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. రాత్రి 10:50 నిమిషాలకు ఇండోర్‌కు చేరుకుంటుంది. భోపాల్- జబల్‌పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా రేవా వరకు పొడిగించినట్లు డివిజినల్ అధికారులు తెలిపారు. మైహార్, సత్నా, కట్ని స్టేషన్ల మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications