ఇండోర్ లో.. కలుషిత నీరు తాగి 10 మంది మృతి.. అసలు కారణం ఇదే..
దేశవ్యాప్తంగా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఆనందంలో ఉన్న క్రమంలో దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా అనేక సార్లు గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో తీవ్ర విషాదం జరిగింది. కలుషిత తాగునీరు తాగిన కారణంగా అనారోగ్యానికి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 6 నెలల శిశువు కూడా ఉన్నట్లు తేలింది. మరో 1,100 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసే మంచినీటి పైపులైన్ లో మురుగునీరు కలవడం కారణంగా ఈ విషాద ఘటన జరిగింది. డిసెంబర్ 25 నుంచే కుళాయిల నుంచి దుర్వాసన వస్తోందని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని భగీరథ్ పుర వాసులు తెలిపారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాదకరమైన ఘటన జరిగింది. కలుషిత నీరు తాగి 10 మంది మృతి చెందారు. మరో 2 వేల వరకు బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలోనే శుభ్రమైన నగరంగా ఇండోర్ వరుసగా ఎనిమిది సంవత్సరాలుగా నిలుస్తోంది. అలాంటి నగరంలో ఈ ఘటన జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. మృతుల్లో 6 నెలల శిశువు కూడా ఉన్నట్లు తేలిన నేపథ్యంలో అక్కడి పరిస్థితి ఎలా ఉందో స్పష్టం అవుతోంది.
అయితే ప్రధాన నీటి సరఫరా పైప్ లైన్ లోని లీకేజీ కారణంగానే నీరు కలుషితమైందని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అంచనాకు వచ్చారు. పైప్ లైన్ పైన ఒక టాయిలెట్ నిర్మాణం ఉందని తెలిపారు. లీకేజీ కారణంగా మురుగునీరు తాగునీటిలో కలిసిపోయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషాద ఘటన వెనుక యంత్రాంగం నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టుగా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఇండోర్ లో నెలకొన్న పరిస్థితిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ ఘటన అత్యవసర పరిస్థితి లాంటిది అని అభివర్ణించారు. భగీరత్ పురాలో దాదాపు 40 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించామని తెలిపారు. ఈ మేరకు 2,456 అనుమానిత కేసులు గుర్తించామని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చేరిన రోగుల్లో ఇప్పటివరకూ 50 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications