వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షీనా బొరా సింగపూర్‌ ఖాతాలోకి రూ. 900 కోట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య వెనక బలమైన ఆర్థిక కారణాలున్నాయని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టుకు తెలిపారు. దీనికి సబంధించి పలు కీలక పత్రాలు తమకు లభించాయని చెప్పారు. 2006-07 మధ్య పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి సుమారు 900 కోట్లతో పలు కంపెనీలు ఏర్పాటు చేసినట్లు చెప్పింది.

షీనా పేరుతో సింగపూర్‌లోని హెచ్‌ఎస్‌బీసీ అకౌంట్‌లో కోట్లలో నగదు ఉన్నట్లు వెల్లడించింది. ఇంద్రాణి స్నేహితురాలైన గాయత్రి అహుజా ఈ అకౌంట్ తెరచినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ ఖాతాలో సమాచారం కోసం సీబీఐ ఇంటర్ పోల్ సహాయం కోరింది. షీనా పేరుతో ఉన్న అకౌంట్ల ద్వారా పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి పలు ఆర్థిక లావాదేవీలు జరిపారని, ఆమె హత్యకు ఇది కూడా ప్రధాన కారణమని సీబీఐ ఆరోపించింది.

Indrani Mukerjea opened bank accounts in name of Sheena Bora in Singapore: Peter to CBI

ఆమె ప్రియుడు, పీటర్ కుమారుడైన రాహుల్ ముఖర్జీ ఇచ్చిన పలు కీలక పత్రాలు దీన్ని బలపరుస్తున్నాయని కోర్టుకు తెలిపింది. దీనిపై విచారించేందుకు పీటర్ కస్టడీ పొడిగింపును సీబీఐ కోరగా ఈ నెల 30 వరకు ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది.

తన కంపెనీ 9ఎక్స్ మీడియా ద్వారా ఇంద్రాణి ముఖార్జియా రూ. 900 కోట్లు తరలించినట్లు సిబిఐ తెలిపింది. ఇంద్రాణి షీనా బోరా పేరు మీద సింగపూర్, హాంగ్‌కాంగ్ హెచ్‌ఎస్‌బిసిలో ఖాతాలు తెరిచి ఉండవచ్చునని పీటర్ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.

English summary
Closing in on the financial trail in the Sheena Bora murder case, the CBI on Thursday told a court that former media baron Peter Mukerjea and his wife Indrani allegedly siphoned off funds to the tune of Rs 900 crore from their company 9X Media through a layer of nine companies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X