Coronavirus Patient:బెంగళూరులో ఇన్ఫోసిస్ భవనం ఖాళీ, ఉద్యోగుల క్షేమం!
బెంగళూరు: కరోనా వైరస్ (కోవిడ్ 19) దెబ్బతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ బెంగళూరులోని తన కార్యాలయాన్ని ఖాళీ చేసింది. కరోనా వైరస్ వ్యాధి కంపెనీ ఉద్యోగులకు సోకకుండా ముందస్తు చర్యలో భాగంగా తమ భవన్నాన్ని ఖాళీ చేశామని ఇన్ఫోసిస్ సంస్థ వివరించింది. ఇప్పటికే ఇన్ఫోసిస్ కంపెనీలోని కొందరిని కరోనా వైరస్ వ్యాధి సోకిందని అనుమానం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఇన్ఫోసిస్ బెంగళూరు డెవలప్ మెంట్ సెంటర్ హెడ్ గురురాజ్ దేశ్ పాండే స్పష్టం చేశారు.

ఇన్ఫోసిస్ ఉద్యోగికి కరోనా!
ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ వ్యాధి సోకిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ లోని కొందరు ఉద్యోగులకు కరోనా వైరస్ వ్యాధి సోకిందని అనుమానాలు కలిగాయని ఆ కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఇలాంటి సమయంలో బెంగళూరులోని తన కార్యాలయాన్ని ఖాళీ చెయ్యాలని ఇన్ఫోసిస్ కంపెనీ ప్రతినిధులు నిర్ణయించారు.

ఉద్యోగుల క్షేమం ముఖ్యం
కంపెనీ ఉద్యోగికి కరోనా వైరస్ వ్యాధి సోకడంతో ముందస్తుగా ఈ చర్యలు తీసుకుంటున్నామని, అందుకే తమ భవనం ఖాళీ చేయించామని ఇన్ఫోసిస్ బెంగళూరు డెవలప్ మెంట్ సెంటర్ హెడ్ గురురాజ్ దేశ్ పాండే పేర్కొన్నారు. కంపెనీ ఉద్యోగులకు కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా కార్యాలయం మొత్తం శుభ్రం చెయ్యడానికి ఇలాంటి చర్యలు తీసుకున్నామని గురురాజ్ దేశ్ పాండ్ వివరించారు.

కంపెనీ ఉద్యోగులు నమ్మండి
కార్యాలయం మొత్తం శుభ్రం చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తున్నామని, దయచేసి పుకార్లు నమ్మరాదని, అనవసరంగా సోషల్ మీడియాలో అవాస్తవాలు పుకార్లుగా పుట్టిస్తున్నారని, వాటిని మీరు నమ్మకండి అని ఇన్ణోసిస్ బెంగళూరు డెవలప్ మెంట్ హెడ్ గురురాజ్ దేశ్ పాండ్ మనవి చేశారు.

కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు!
పుకార్లు నమ్మి వాటిని మీరు మరింత ప్రచారం చెయ్యరాదని ఉద్యోగులకు గురురాజ్ దేశ్ పాండ్ మనవి చేశారు. కరోనా వైరస్ కు అందరూ దూరంగా ఉండటానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు, బయోటెక్ కంపెనీలను ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఇన్ఫోసిస్ బెంగళూరు డెవలప్ మెంట్ సెంటర్ హెడ్ గురురాజ్ దేశ్ పాండ్ వివరించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications