ఐఎన్ఎల్డీ ప్రెసిడెంట్ నఫే సింగ్ రాఠీని కాల్చి చంపారు
ఛండీగఢ్: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) పార్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, బహదూర్‌గఢ్ మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠీ దుండగుల కాల్పుల్లో మృతి చెందారు. నఫే సింగ్‌తో పాటు ఆయన పార్టీ కార్యకర్త కూడా ఈ తుపాకీ దాడిలో మరణించారు. ఈ ఘటనలో ఆయన ప్రైవేట్‌గా నియమించుకున్న గన్‌మెన్‌లు గాయాపడ్డారు.
నఫే సింగ్ తన వాహనంలో ఝజ్జర్ జిల్లాలో ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు.. నఫే సింగ్ కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో కారు ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నఫే సింగ్ ప్రాణాలు కోల్పోయారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడి పక్కా ప్రణాళికతో జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, ఈ దాడిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.
#WATCH बहादुरगढ़: वीडियो घटनास्थल से हैं जहां हरियाणा INLD प्रमुख नफे सिंह राठी पर कथित हमला हुआ। https://t.co/VMQ6CTFufm pic.twitter.com/AsnlWkm4IT
— ANI_HindiNews (@AHindinews) February 25, 2024
సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలో శాంతిభద్రతలు అడుగంటిపోయాయని విమర్శలు గుప్పిస్తున్నారు. రాఠీ ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఐఎన్ఎల్‌డీ నేత అభయ్ చౌతాలా ఆరోపించారు.












Click it and Unblock the Notifications