షాకింగ్: ‘నిర్భయ’ను మించిన ఘోరం... అదీ పోలీస్ స్టేషన్ లో, ఏం జరిగిందంటే...
ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ ను మించిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. దారుణమైన విషయం ఏమిటంటే.. ఈ ఘటనలో నిందితులు సాక్షాత్తు పోలీసులే కావడం.
శ్రీనగర్: ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ ను మించిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. దారుణమైన విషయం ఏమిటంటే.. ఈ ఘటనలో నిందితులు సాక్షాత్తు పోలీసులే కావడం. జమ్మూలోని కనాలాల్ పోలీస్ స్టేషన్లో కొన్ని రోజుల క్రితం ఈ దారుణం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జమ్మూ కానాచక్ ప్రాంతానికి చెందిన ఓ మహిళను (25) దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కనాలాల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆమెపై నిర్భయ గ్యాంగ్ రేప్ తరహాలో తీవ్ర హింసను ప్రయోగించడంతోపాటు, లైంగికంగా కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కస్టడీలో ఉన్నపుడు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వేధించాడు. అయితే మే 6వ తేదీన బాధితురాలికి బెయిల్ మంజూరు అయింది. దీంతో ఆమె తనకు జరిగిన అన్యాయంపై తన న్యాయవాది సహాయంతో పోరాటానికి సిద్దపడింది.

స్టేషన్ ఎస్.హెచ్.ఒ. రాకేశ్ శర్మ వారం రోజులపాటు తనను హింసించిన తీరును బాధితురాలు మీడియాకు వివరించింది. తీవ్రమైన హింసతోపాటు, లైంగిక దాడికి పాల్పడ్డాడని, ప్రయివేట్ పార్ట్స్ లో బీర్ బాటిల్ చొప్పించేందుకు ప్రయత్నించాడని, కారంపొడిని చల్లారని ఆరోపించింది.
పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు తినడానికి ఏమీ ఇవ్వలేదని బాధితురాలు వాపోయింది. నీళ్ళు అడిగితే, మూత్రం తాగమంటూ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించింది. తనపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు, తల్లి, భర్త, పిల్లలను పోలీసులు తీవ్రంగా కొట్టినట్టు కూడా ఆ మహిళ ఆరోపించింది.
బాధితురాలి తరపు న్యాయవాది ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నిర్భయ కేసులో మాదిరిగా సాక్షాత్తు పోలీసులే ప్రవర్తించారంటూ మండిపడ్డారు. కాపాడాల్సిన పోలీసులే బాధితురాలిని క్రూరంగా హింసించారని ఆయన ఆరోపించారు.
మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయంలోని సహాయ మంత్రి జితేంద్ర సింగ్ జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వాన్ని వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications