వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Inspirational: సివిల్ జడ్జీగా ఎంపికైన కూరగాయల వ్యాపారి కూతురు

|
Google Oneindia TeluguNews

ఇండోర్: ఎన్ని కష్టాలు, అవాంతరాలు ఎదురైనా లక్ష్యం కోసం శ్రమించేవారికి విజయం తప్పక లభిస్తుందనడానికి ఉదాహరణగా నిలిచారు ఈ కూరగాయాల అమ్ముకునే వ్యక్తి కూతురు అంకిత నగర్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌కు చెందిన 29 ఏళ్ల అంకిత నగర్.. నాలుగోసారి రిక్రూట్‌మెంట్ పరీక్ష రాసి సివిల్ జడ్జీగా ఎంపికయ్యారు.

జడ్జీ కావాలనే బలమైన కోరికతో..

జడ్జీ కావాలనే బలమైన కోరికతో..

బిహేవియరల్ జడ్జీ(సివిల్ జడ్జీ) క్లాస్-II పోస్టుకు ఎంపికయ్యారు. కాగా, అంకిత నగర్ తండ్రి అశోక్ నగర్.. ఇండోర్‌లోని ముసఖేడి ప్రాంతంలో కూరగాయలు విక్రయిస్తుంటారు.
గురువారం అంకిత మీడియాతో మాట్లాడుతూ.. జడ్జీ కావాలనే బలమైన కోరికతో తాను మూడు సార్లు విఫలమైనప్పటికీ.. తన ప్రయత్నాన్ని వీడలేదని చెప్పారు.

ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యం వైపుగానే..: అంకిత

ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యం వైపుగానే..: అంకిత

నాలుగోసారి తాను సివిల్ జడ్జీ క్లాస్-II ఎగ్జామినేషన్ క్లియర్ చేసినట్లు అంకిత నగర్ తెలిపారు. చివరకు తాను అనుకున్నది సాధించానని, తన ఆనందానికి వెల్లడించడానికి పదాలు సరిపోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ తాను తన ప్రయత్నాన్ని వదులుకోలేదని చెప్పారు. లక్ష్యం వైపుగా ముందుకు సాగినట్లు తెలిపారు.

తండ్రికి సాయపడుతూనే అంకిత ప్రిపరేషన్

తండ్రికి సాయపడుతూనే అంకిత ప్రిపరేషన్

అంతేగాక, తాను ప్రిపరేషన్ అవుతూ కూడా తన తండ్రికి పనుల్లో సాయపడినట్లు అంకిత నగర్ తెలిపారు. అయితే, తాను డాక్టర్ కావాలని కోరుకున్నానని.. అయితే, అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో తాను సివిల్ జడ్జీ పరీక్షకు సిద్ధమైనట్లు అంకిత వెల్లడించారు. ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ల ద్వారానే తన చదువులు పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు.

అంకిత తమకు గర్వ కారణమంటూ తల్లిదండ్రులు

అంకిత తమకు గర్వ కారణమంటూ తల్లిదండ్రులు

తన కూతురు ఎంతో శ్రమించి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంపై అంకిత తండ్రి అశోక్ ఆనందం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోకూడదని తన కూతురు ఉదాహరణగా నిలిచిందని చెప్పారు. అంకిత చదువుల కోసం తాను, తన భార్య అనేక విషయాల్లో కాంప్రమైజ్ అయినట్లు తెలిపారు. అయితే, చివరకు తమ కూతురు సాధించిన విజయం తమకు గర్వకారణంగా నిలిచిందని అశోక్ సంతోషం వ్యక్తం చేశారు.

పెళ్లి కాదు.. చదువే ముందు..: అందరికీ న్యాయ చేస్తానంటూ అంకిత

పెళ్లి కాదు.. చదువే ముందు..: అందరికీ న్యాయ చేస్తానంటూ అంకిత

ఎవరూ కూడా తమ కూతుళ్లకు పెళ్లి చేసి పంపించాలని చూడకుండా.. వారిని ఉన్నత చదువులు చదివించాలని, వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయాలని అశోక్ అందరు తల్లిదండ్రులకు సూచించారు. ఎల్ఎల్ఎం మాస్టర్ డిగ్రీ కలిగిన అంకిత తన చిన్ననాటి నుంని న్యాయవాద విద్య అంటే ఇష్టమని తెలిపింది. తన కోర్టు వచ్చిన వారందరికీ న్యాయం జరిగేలా చూస్తానని అంకిత పేర్కొన్నారు.

English summary
Ankita Nagar, Daughter Of Vegetable Seller Who Became A Civil Judge In Indore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X