శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు శుభవార్త

శబరిమల: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయ దేవస్థానం భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రతి ఏడాది వస్తున్న విషయం తెలిసిందే. దీంతో భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కొంతమంది భక్తులు స్వామి దర్శనం చేసుకోకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే, ఈసారి మాత్రం జరగబోయే మండల, మకరవిళక్కు సీజన్‌లో అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది.
అదేమంటే.. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్‌లో అయ్యప్పస్వామి దర్శనం కోసం.. ఇక నుంచి రోజుకు 50 వేల మంది భక్తులను అనుమతించనున్నారు.

insurance coverage for sabarimala ayyappa swamy darshan pilgrims

భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్ విధానం ద్వారా టికెట్‌లను బుకింగ్‌ చేసుకుని స్వామి వారిని దర్శించుకోవచ్చు. కాగా, గతంలో దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం పదిరోజుల ముందు నుంచి మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ప్రస్తుతం మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కల్పించింది. అంతేగాక, శబరిమల యాత్రకు వచ్చే భక్తులకు ఆరోగ్య భద్రత కల్పించడానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి వర్చువల్ క్యూ ద్వారా దర్శనం చేసుకునే భక్తులకు ఇన్సూరెన్స్ పాలసీని అందించనున్నట్లు ప్రకటించింది. యాత్ర సమయంలో అనుకోని పరిణామాలు ఎదురైతే ఇన్సూరెన్స్‌ అందించేందుకు దీనిని తీసుకువచ్చినట్లు దేవస్థానం బోర్డు వెల్లడించింది. భక్తులు టికెట్‌లు బుకింగ్‌ చేసుకునే సమయంలోనే వారి వద్ద నుంచి రూ.10లను తీసుకుని ఇన్సూరెన్స్‌ పాలసీని అందిస్తారు. దీనివల్ల అనుకోని సందర్భాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే భక్తులకు చాలా ఉపయోగంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు, అయ్యప్పస్వామి దర్శనం కోసం వచ్చే మహిళలు, చిన్నారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు. అలాగే ప్రత్యేకంగా మహిళలు, దివ్యాంగుల కోసం అప్పం, అరవణ ప్రసాదం పంపిణీ కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. డోలీ సేవల కోసం ముందస్తుగానే ప్రీపెయిడ్ రిజిస్ట్రేషన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు . అంతేగాక, అన్నదాన మండపం వద్ద కూపన్‌ల స్థానంలో పీవోఎస్ మెషీన్ల ద్వారా టోకెన్లు ఇవ్వాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+