వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమాన హైజాక్, గోద్రా అల్లర్ల వీడియో చూపిస్తూ ట్రైనింగ్ .. జైషే మహ్మద్ శిబిరం గురించి వెల్లడించిన ఐబీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఐఏఎఫ్ ఫైటర్ల దాడితో బాలాకోట్ లోని జైషే మహ్మద్ శిక్షణ శిబిరంలో జరుగుతోన్న ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. పాక్ గడ్డపై .. నడిబొడ్డుపై ఉన్న శిక్షణ శిబిరంలో వారికి తీవ్రవాద భావజాలం వైపు మళ్లేందుకు గతంలో జరిగిన దాడులను, హైజాక్ ఘటనలు చూపిస్తూ శిక్షణ ఇస్తున్నారని భాతర నిఘావర్గాలు చెప్తున్నాయి.

శిక్షణ ఇలా ఇస్తారు ?

శిక్షణ ఇలా ఇస్తారు ?

ఇతర దేశాల్లో దాడులు చేసి అలజడి సృష్టించేందుకు శిక్షణ ఇస్తోన్న జైషే మహ్మద్ శిక్షణ శిబిరం 6 ఎకరాల్లో విస్తరించింది ఉంది. ఐదంతస్తుల భవనంలో ఒకేసారి 600 మందికి ట్రైనింగ్ ఇచ్చే సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అక్కడే శిక్షణ పొందేవారికి తీవ్రవాద భావజాలం ఎక్కువ కలిగేందుకు, ప్రాణత్యాగం చేసేందుకు కోసం ప్రత్యేకంగా తర్పీదును ఇస్తారు. ఇందుకోసం గతంలో ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యల వీడియోలను ప్రదర్శిస్తారు.

హైజాక్ .. గోద్రా అల్లర్ల వీడియోలే ప్రేరణ ?
భారతదేశానికి చెందిన ఐసీ 814 విమానాన్ని జైషే ఉగ్ర మూకలు హైజాక్ చేసిన వీడియోను చూపిస్తూ .. తాము ఎలా మసులుకోవాలి .. భద్రతాదళాల కళ్లు ఎలా గప్పాలో వివరిస్తారు. దీంతోపాటు 2002 సంవ్సరంలో గోద్రాలో జరిగిన మారణహోమం అల్లర్లకు సంబంధించిన వీడియోను చూపించి వారిలో ఉగ్రోన్మాదం కలిగేలా ప్రేరేపిస్తారు.

నాలుగు మార్గాల ద్వారా తరలింపు

నాలుగు మార్గాల ద్వారా తరలింపు

బాలాకోట్ లోని శిక్షణ శిబిరంలో ట్రైనింగ్ పూర్తిచేసిన వారిని జమ్ము కశ్మీర్ పంపిస్తారు. కశ్మీర్ కు పంపించడం అంతా సులువుగా చెరవేయారు. బాలాకోట్ నుంచి 4 మార్గాల ద్వారా వారిని కశ్మీర్ కు పంపిస్తారు. ఖేల్ దునియాల్, ఖేల్ ఖైనంతవాలి, ఖేల్ లోలాబ్ జిల్లా, ఖేల్ ఖంచామ క్రలోపా ద్వారా వారిని చేరుస్తారని నిఘావర్గాలు పేర్కొన్నాయి. అక్కడ వారు భారత సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతారు. సరిహద్దులో కాల్పుల విమరణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ కయ్యానికి కాలుదువ్వుతారు.

ఉగ్ర మూకల ట్రైనింగ్ లో రకాలు
ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు వివిధ పద్ధతులను అవలంభిస్తారు. ఆధునిక యుద్ధ కోర్సును 3 నెలల్లో పూర్తి చేస్తారు. దీనినే దౌరా ఈ ఖాస్ అని కూడా పిలుస్తారు. అలాగే సాయుధ శిక్షణ కోర్సు కూడా ఉంటుందని .. దీనిని దౌవమ్ ఆల్ రయిద్ అంటారని చెప్తున్నారు. దీనికి రిప్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని కూడా అంటారని పేర్కొన్నారు.

ఆధునిక రైఫిళ్ల వినియోగం

ఆధునిక రైఫిళ్ల వినియోగం

శిక్షణ కాలంలో ఉగ్ర మూకలకు ఏకే 47, మిషిన గన్స్ తదితర ఆధునికి పరికరాలతో ట్రైన్ చేస్తారు. ఎల్ఎంజీ, రాకెట్ లాంచర్లు, అండర్ బ్యారెల్ గ్రనేడ్ లాంచర్, గ్రెనేడ్ లను విసిరేయడం నేర్పి మానవ బాంబులుగా మారుస్తారు. ప్రాథమిక శిక్షణలో భాగంగా ఆయుధాల వినియోగం .. అటవీలో సంచరించడం, జీపీఎస్ ద్వారా ఆధునాతన సాంకేతిక పరిజానం ఉపయోగించే తదితర అంశాలు ఉంటాయని వెల్లడించాయి.

ఉదయం 3 గంటలతో దినచర్య
శిక్షణ శిబిరంలో చేరేవారికి కఠోర శ్రమ ఉంటుంది. ఉదయం 3 గంటలతో ఉగ్ర మూకల దినచర్య ప్రారంభమవుతోంది. ఖురాన్ చదివి ప్రార్థనలు చేసి .. కార్మోన్ముఖులవుతారు. తర్వాత లక్షాన్ని ఎలా ఎంచుకోవాలి .. ఆకస్మికంగా ఎలా దాడిచేయాలి .. భద్రతా దళాలు స్పందిస్తే ఎలా తిప్పికొట్టాలనే అంశపై శిక్షణ ఇస్తారు. వాయిసేన నేలమట్టం చేసిన ఈ కేంద్రంలో ప్రతి ఏటా 200 నుంచి 300 మందికి శిక్షణ ఇచ్చారని ఐబీ వర్గాలు వెల్లడించాయి.

English summary
According to intelligence reports, the camp was used for radicalisation by showing propaganda videos on the IC 814 hijacking and the 2002 Godhra riots, officials said. They added that after training, the militants were sent to Jammu and Kashmir, primarily through four routes. They have been identified as Balakot-Kel-Dudhniyal, Kel-Kainthawali, Kel-Lolab district and Kel-Kachama Kralpora, an official said. All the routes led to Kupwara, the reports stated, according to an official.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X