భారత్‌లో అత్యంత శీతల ప్రాంతం ఇదే.. సగటున -40 డిగ్రీల ఉష్ణోగ్రత !!

కాలం మారుతుంది.. రోజలు పరిగెడుతున్నాయ్.. మొత్తానికి శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడం సర్వసాధారణంగా జరిగే విషయమే. తెలుగు రాష్ట్రాల్లో 10 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గితేనే చలి తీవ్రతకు బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. అయితే మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల పరిస్థితి ఊహిస్తే ఒకింత ఆలోచనల్లో పడతాం అనడంలో సందేహం అక్కర్లేదు.

కాగా ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశాల గురించి చెప్పాలంటే.. మానవులు నివసించే అత్యంత శీతల ప్రాంతం రష్యాలోని ఓమియాకాన్. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత మైనస్ 71 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. అదే మన దేశంలో అత్యంత చలిప్రదేశంగా ఏదంటే లద్దాఖ్‌లోని ద్రాస్ గ్రామం అనే చెప్పాలి. ఇది ప్రపంచంలోనే రెండో అత్యంత శీతల ప్రదేశంగా గుర్తింపు పొందింది.

interesting-details-about-indias-coldest-village-dras-and-temparatures

ద్రాస్ గ్రామం ఎక్కడుందంటే..

లద్దాఖ్‌లోని కార్గిల్ జిల్లాలో పర్వతాల మధ్య మంచుతో కప్పబడినట్లుగా ద్రాస్ గ్రామం ఉంటుంది. శ్రీనగర్-కార్గిల్ మార్గంలో ప్రయాణించే వారికి ఈ గ్రామం కనబడుతుంది. శీతాకాలంలో ఇక్కడ సగటున మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ గడ్డకట్టే చలి కారణంగా సాధారణ పర్యాటకులు ఇక్కడికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తారు. సాహస యాత్రికులు మాత్రం శీతాకాలంలోనే ద్రాస్‌ను సందర్శిస్తారు. ఎటు చూసినా పర్వతాలు, తెల్లని మంచు.. ద్రాస్ నది అందాలు చూపరులను కట్టిపడేస్తాయి.

ద్రాస్ గ్రామంలో ప్రధానంగా బార్లీ పంట, పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తారు. నిత్యం వెచ్చని ఉన్ని దుస్తులు ధరించి అత్యవసర పనులు ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటకు వస్తారు. పర్యాటకుల కోసం చిన్న హోంస్టేలు కూడా అందుబాటులో ఉన్నాయి.ఇక్కడ బటర్‌ టీ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామం నుంచే అమర్‌నాథ్ యాత్ర, సురు లోయ ట్రెక్కింగ్‌లు ప్రారంభమవుతాయి.

ఎలా వెళ్లాలి & ఎప్పుడు వెళ్లాలంటే..?

పర్యాటకులు ఏడాదిలో రెండు దఫాలుగా ఈ గ్రామాన్ని సందర్శించే అవకాశం ఉంది. అక్టోబర్-మార్చి మధ్యకాలంలో మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో పచ్చదనంతో, వికసించిన పూలతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ద్రాస్‌కు వెళ్లాలంటే లేహ్ విమానాశ్రయంలో దిగి అక్కడి నుండి రోడ్డు మార్గంలో వెళ్లవచ్చు. జమ్మూ-తావి రైల్వేస్టేషన్‌లో దిగి శ్రీనగర్ మార్గంలో కూడా ఈ గ్రామాన్ని చేరుకోవచ్చు.

interesting-details-about-indias-coldest-village-dras-and-temparatures

కార్గిల్ యుద్ధం..

ద్రాస్ పర్యటనలో 1999 కార్గిల్ యుద్ధం గుర్తుకు వస్తుంది. యుద్ధ సమయంలో టైగర్ హిల్, టోలోలింగ్ పర్వతాలు, పాయింట్ 4,875 (బత్రా టాప్) భారత సైన్యం ధైర్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. గ్రామంలోకి ఎంటర్ అవ్వగానే సున్నపురాయితో నిర్మించిన కార్గిల్ యుద్ధ స్మారకం కనిపిస్తుంది. అలానే విజయ్‌పథ్, సైనికుల ఫోటోలు, ఆయుధాలు, యుద్ధ సమయంలో జరిగిన ఆపరేషన్ల వివరాలు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+