Moon: చంద్రుడిపై భూమి కొనుగోలు చేస్తే మీరు మోసపోయినట్లే..!
కొన్ని సంవత్సరాల క్రితం చంద్రుడిపై భూమి కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఓ తెలంగాణ ఎన్నారై మహిళ తన తల్లి కోసం చంద్రుడిపై భూమి కొన్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఎన్నారై మహిళ ఈ మధ్యే ఇంటికొచ్చి తన తల్లి చంద్రుడిపై భూమికి సంబంధంచి పత్రాలు కూడా అందజేశారు. అంతకు ముందు చంద్రుడిపై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా ప్లాట్ కొన్నారు. అయితే కొనుగోలు చేయడం వరకు సరే.. అక్కడికి ఎప్పుడు వెళ్తారు.. చంద్రడుపై హక్కు ఎవరికి ఉంది అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
అంతర్జాతీయ చట్టాలను పరిశీలిస్తే చంద్రుడిపై ఎవరికి హక్కు లేదని తెలుస్తోంది. చంద్రుడిపై భూములు అమ్ముతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలన్ని బోగస్ అని తెలిపోతోంది.
ఎందుకంటే అక్కడ ఎక్కడ భూమి కేటాయించారో తెలియదు. వాటి సర్వే నంబర్లు లేవు. అస్సలు అక్కడి మనుషులు వెళ్తారా అనేది దాని గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితిల్లో అక్కడ భూమి కొనుగోలు చేస్తే పత్రాలు తప్ప ఏమీ రాదు. ఆ పత్రాలను ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకోవడం తప్ప అవి పనికి రావని అంతర్జాతీయ చట్టాలు తేల్చిచెబుతున్నాయి.

అయితే ఇప్పటి వరకు చంద్రుడిపైకి రోవర్ల పంపిన ఏ దేశం కూడా చంద్రుడు సొంతమని ప్రకటన చేయేలేదు ఒక చైనా తప్ప. చైనా చంద్రుడపై ఉన్న జాగా అంత తమదే అని వాదిస్తోంది. అంతుకు ముందే సోవియట్ యూనియన్, అమెరికా, బ్రిటన్ 1967లో ఔటర్ స్పేస్ ట్రీటీ ఒప్పందం చేసుకున్నాయి. 2023 ఆగస్ట్ నాటికి ఈ ఒప్పందంపై భారత్ తో పాటు 114 దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఔటర్ స్పేస్పై గానీ, చంద్రుడు సహా ఇతర గ్రహాలపై ఏ దేశానికి హక్కు ఉండదు. సో మీరు చంద్రుడిపై భూమి కొనుగోలు చేస్తే దానికి ఎలాంటి చట్టబద్ధత ఉండదు.
సాధారణంగా ఏదైనా ఒక స్థలాన్ని మనం కొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ముందుగా అది ఒక సార్వభౌమ దేశ అధీనంలో కచ్చతంగా ఉండాలి. ఆ భూమిపై హక్కుల మార్పిడి, లావాదేవీలు నిర్వహించేందుకు ఆ దేశంలో సరైన చట్టాలు కూడా ఉండాలి. అలాటప్పుడే భూమి పై హక్కు ఉంటుంది. కానీ చంద్రుడి భూమిపై ఏ దేశానికి కూడా సార్వభౌమ అధికారం లేదని గుర్తుంచుకోవాల్సిన విషయం. చంద్రుడిపై ప్లాట్లు అమ్ముతున్న లూనార్ రిజిస్ట్రీ, లూనార్ ఎంబసీ వంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ కంపెనీలేవీ చట్టబద్ధమైనవి కావని తేలింది.












Click it and Unblock the Notifications