International womens day:చైనా సరిహద్దులో మహిళా పోలీసుల గస్తీ...ఏం జరిగిందో వీడియో చూడండి..!!
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ రోజును ఎంతో గొప్పగా జరుపుకుంటారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున మహిళలకు సెలవు దినంగా ప్రకటించాయి. మన దేశంలో స్త్రీ మూర్తిని దేవతలా పూజిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు కొంత అభద్రతా భావంతోనే జీవిస్తున్నారనేది నగ్న సత్యం. బయటకు వెళ్లిన ఆడపిల్ల ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేవరకు ఆ తల్లిదండ్రులకు కంటిమీద కునుకు ఉండదు. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ మహిళలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు.ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే... మరోవైపు నేటి మహిళలు అంతరిక్ష రంగంతో సహా అన్ని రంగాల్లో ముందుంటున్నారు. పురుషులకు మించి తమ సత్తాను చాటుతున్నారు. అలాంటి చిన్న కథనాలు ఇప్పుడు చూద్దాం.
చైనా సరిహద్దులో మహిళా జవాన్లు
మన దేశ సరిహద్దును కాపాడే బాధ్యత కేవలం పురుష జవాన్లే నిర్వర్తించడం లేదు. వారికి ధీటుగా మహిళా జవాన్లు కూడా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ చైనా సరిహద్దు ప్రాంతంలో తుపాకి పట్టుకుని కవాతు చేస్తున్న వీడియో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైరల్ అవుతోంది. వీరంతా ఇండో టిబెటన్ బోర్డర్ మహిళా పోలీసులు. దేశం కోసం కుటుంబాలను వీడి ఇదిగో ఇలా గస్తీలో ఉన్నారు.
కొండ ప్రాంతంలో మహిళా డ్రైవర్
ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మీనాక్షీ నేగి. షిమ్లా కొండ ప్రాంతంలో మీనాక్షి టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తోంది. వచ్చిన పర్యాటకులను తన టాక్సీలో ఎక్కించుకుని గమ్యస్థానాలకు చేరుస్తోంది. జీవనోపాధి కోసం కాకుండా ఈ డ్రైవింగ్ వృత్తిని ఇష్టంతో ఎంచుకున్నట్లు చెప్పింది. తనకు కొండ ప్రాంతాల్లో డ్రైవ్ చేయడమంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. తనకు తన కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కూడా వెల్లడించింది.
12వేల చదరపు అడుగుల రంగోలీ
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రంగోలీ ఆర్టిస్ట్ శిఖా శర్మ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 12వేల చదరపు అడుగుల రంగోలీని వేసింది. ఈ భారీ రంగుల ముగ్గును పూర్తి చేసేందుకు రెండు రోజుల సమయం పట్టిందని శిఖా శర్మ చెప్పారు. మహిళా సాధికారికత కాన్సెప్ట్ తీసుకుని ఈ రంగోలీని వేసినట్లు శిఖా శర్మ చెప్పారు.












Click it and Unblock the Notifications