ఈనెల 16 నుండి ప్రతిరోజూ పెట్రోల్ ధరల్లో మార్పులు

ప్రతి రోజూ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మారనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు నిర్ణయించాయి. జూన్ 16వ, తేది నుండి ప్రతిరోజూ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మారిపోనున్నాయి.

న్యూఢిల్లీ: ప్రతి రోజూ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మారనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు నిర్ణయించాయి. జూన్ 16వ, తేది నుండి ప్రతిరోజూ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మారిపోనున్నాయి.

అయితే ఇంధన సంస్థల నిర్ణయం తమ లాభనష్టాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పెట్రోలియం డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి 15 రోజులకు ఓసారి ఇంధన ధరలను ఇంధన సంస్థలు సమీక్షిస్తున్నాయి.

petrol rates

ప్రయోగాత్మకంగా మే 1వ, తేది నుండి పుదుచ్చేరి, చంఢీగఢ్, జంషెడ్ పూర్, ఉదయ్ పూర్, విశాఖపట్టణం నగరాల్లో రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కూడ రోజువారీ ఇంధన ధరల సవరణ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ రంగసంస్థల బాటలోనే ప్రైవేట్ పెట్రోల్ సంస్థలైన ఎస్సార్, రిలయన్స్ సంస్థలు కూడ ఇదే విధానాన్ని అమలు చేయనున్నాయి.

ఇంధన సంస్థల నిర్ణయంపై డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ ధరల వద్ద కొనుగోలు చేసే ఇంధన నిల్వలను ఏ ధర వద్ద విక్రయించాలనే దానిపై తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉంది.

దేశంలో ఇప్పటికే చాలా పెట్రోల్ బంకుల్లో ఆటోమెటిక్ వ్యవస్థలు లేవు. ఫలితంగా తమ లాభాలపై ప్రభావం పడుతోందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని భారత పెట్రోల్ బంక్ ల యజమానుల కన్సార్టియం అధ్యక్షుడు ఎ.డి. సత్యనారాయణ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+