IPL 2023 : ఈసారి ఐపీఎల్ లో కొత్త నిబంధన-ఇంపాక్ట్ ప్లేయర్ తో ఫ్రాంచైజీలపై పడే ప్రభావమెంత ?

ఏటికేడాది ఐపీఎల్ సీజన్లను అభిమానుల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న బీసీసీఐ.. ఈసారి కూడా పలు నిబంధనలను మార్చింది. ఇందులో టాస్ తర్వాత జట్ల పేర్ల ప్రకటనతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ వంటి నిబంధనల్ని తీసుకొస్తోంది. వీటిపై ఇప్పుడు ఐపీఎల్ టీమ్ లు, ఫ్రాంచైజీలతో పాటు అభిమానుల్లోనూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023లో అమలు చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన గురించి తెలుసుకుందాం..

ఈ ఏడాది ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను అమల్లోకి తెచ్చారు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో దీన్ని వాడుతుండగా.. ఇప్పుడు ఐపీఎల్ లోనూ ఇది చేరిపోయింది. ఇందులో ఇప్పటివరకూ ప్రతీ జట్టులో ఆడుతున్న 11 మంది ఆటగాళ్లతో పాటు మరో అదనపు ఆటగాడిని చేర్చుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఈ 12వ ఆటగాడినే ఇంపాక్ట్ ప్లేయర్ గా పేర్కొంటున్నారు. అయితే ఈ 12వ ఆటగాడు లేదా ఇంపాక్ట్ ప్లేయర్ రాకతో ఎవరికి లాభం, మరెవరికి నష్టం ?

IPL 2023 : How New Impact Player Rule shows impact on Franchises ?

తాజా నిబంధన ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ బౌలింగ్ చేస్తున్నప్పుడు లేదా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆడే జట్టులోకి 'ఇంపాక్ట్ ప్లేయర్'ని తీసుకురావడానికి అనుమతిస్తుంది. జట్టులో ఆటగాళ్ల పేర్లను సమర్పించేటప్పుడు, కెప్టెన్‌లు నలుగురు ప్రత్యామ్నాయ ఆటగాళ్లను పేర్కొనడానికి అనుమతించబడతారు. వారి నుండి ఒకరిని తర్వాత పిలవవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ పిచ్‌పైకి వచ్చినప్పటి నుండి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏదైనా చేయగలడు. కానీ ప్లేయింగ్ ఎలెవన్ లో ఫ్రాంచైజీలో నలుగురు కంటే తక్కువ విదేశీ ఆటగాళ్లు ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా భారతీయ ఆటగాడు మాత్రమే ఉండాల్సి ఉంటుంది.

టీమ్ షీట్‌లో పేర్కొన్న 4 సబ్‌స్టిట్యూట్‌లలో భాగంగా తీసుకున్న విదేశీ ఆటగాడిని ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకోవచ్చు. ఒక జట్టు ఒక మ్యాచ్‌లో విదేశీ ఆటగాడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పరిచయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదో విదేశీ ఆటగాడు ఆడకూడదు.ఇంపాక్ట్ ప్లేయర్ ను ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు లేదా ఓవర్ పూర్తయిన తర్వాత ఆటలోకి తీసుకురావచ్చు. మరోవైపు బ్యాటింగ్ విషయానికి వస్తే ఇంపాక్ట్ ప్లేయర్ వికెట్ పడినప్పుడు లేదా ఒక ఓవర్ సమయంలో ఎప్పుడైనా రిటైర్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు తీసుకురావచ్చు. అయితే 'ఇంపాక్ట్ ప్లేయర్'ని జట్టు కెప్టెన్‌గా వాడుకోకూడదు.

ఈసారి ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ ను వాడుకునే విషయంలో ఫ్రాంచైజీలు అనుసరించే వ్యూహాలను బట్టి మ్యాచ్ ల ఫలితాలు కచ్చితంగా తారుమారు అయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీసీసీఐ ఇప్పటికే ఈ నిబంధనను ప్రయోగించింది. దీంతో ఇప్పుడు ఐపీఎల్‌లో దాని ప్రభావంపై ఉత్కంఠ కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+