IPL 2023 : ప్లే ఆఫ్స్ రేసును మలుపు తిప్పబోతున్న SRH vs RCB మ్యాచ్- 7 జట్లకు టెన్షన్..

ఐపీఎల్ 2023 సీజన్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంటోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసుకు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచి అర్హత సాధించింది. దీంతో మిగతా మూడు బెర్తులపై ఉత్కంఠ పెరుగుతోంది. ఈసారి ఐపీఎల్ లో నెలకొన్న గట్టిపోటీయే ఇందుకు కారణం. గతంలో ఏ ఐపీఎల్ సీజన్ లో లేని విధంగా నెలకొన్న పోటీ ఇప్పుడు ప్లే ఆఫ్ రేసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి కొనసాగింపుగా ఇవాళ హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

ఐపీఎల్ 2023 లీగ్ దశలో ఇప్పుడు కేవలం ఆరు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం మూడు ప్లేఆఫ్ బెర్త్‌ల కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో హైదరాబాద్ సన్ రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరుకు గెలిచే అవకాశాలున్నాయి. అయితే ఒకవేళ బెంగళూరుపై హైదరాబాద్ గెలిస్తే మాత్రం లెక్కలన్నీ మారతాయి. ముఖ్యంగా ప్లే ఆఫ్ బెర్తుల కోసం తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో ఈ మ్యాచ్ ఫలితం కచ్చితంగా వీటిని మార్చేసే అవకాశం ఉంది.

 srhvsrcb

ఇవాళ బెంగళూరుపై హైదరాబాద్ గెలిస్తే మాత్రం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, మూడో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆప్స్ కు అర్హత సాధిస్తాయి. దీనికి కారణం ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న బెంగళూరు కంటే 15 పాయింట్ల చొప్పున ఉన్న చెన్నై, లక్నో జట్ల అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే 14 పాయింట్లతో ఉన్న ముంబై అవకాశాలు కూడా మెరుగుపడతాయి. అయితే ముందుగా చెన్నై, లక్నో మాత్రం ప్లేఆఫ్స్ కు చేరుకుంటాయి.
ఆ తర్వాత ప్లేఆఫ్స్ లో చివరి, నాలుగో బెర్తు కోసం ఐదు జట్లు పోటీ పడాల్సి ఉంటుంది.

ఇవాళ హైదరాబాద్ గెలిస్తే చెన్నై, లక్నో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అప్పుుడు నాలుగో బెర్త్ కోసం ముంబైతో పాటు బెంగళూరు, రాజస్తాన్, కోల్ కతా, పంజాబ్ జట్ల మధ్య పోటీ ఉంటుంది. ఇందులో మిగతా నాలుగు జట్ల కంటే రెండు పాయింట్లు ఎక్కువగా ఉన్న ముంబైకి మెరుగైన అవకాశాలుంటాయి. ముంబై తమ చివరి లీగ్ మ్యాచ్ లో గెలిస్తే ఈ నాలుగో బెర్త్ కు నేరుగా అర్హత సాధిస్తుంది. అలా జరగకపోయినా, ఇవాళ బెంగళూరు గెలిచినా ఈ ఆరు జట్ల చివరి లీగ్ మ్యాచ్ ఫలితాలపైనా నాలుగో ప్లే ఆఫ్ బెర్త్ అర్హత ఆధారపడి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+