భారత్‌కు పాక్ మధ్యవర్తిని పంపించిందా?: ఢిల్లీలో ల్యాండ్ అయిన ఇస్లామిక్ దేశ మంత్రి
India Pakistan War: పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగిన నేపథ్యంలో నియంత్రణ రేఖ పొడవునా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు మొత్తం కూడా భీకరంగా తయారయ్యాయి. పూర్తిస్థాయి యుద్ధానికి సన్నద్ధం అన్నట్లు తయారయ్యాయి.
ఈ పరిస్థితుల మధ్య ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి భారత్‌లో అడుగు పెట్టారు. రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. భారత్- ఇరాన్ మధ్య 20వ జాయింట్ కమిషన్ సమావేశానికి ఆయన కో ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. 2024 ఆగస్టులో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అబ్బాస్ భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి.

భారత్-ఇరాన్ ఫ్రెండ్‌షిప్ ట్రీటీపై సంతకం చేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేడు, రేపు ఈ జాయింట్ కమిషన్ ఉన్నత స్థాయి సమావేశం జరుగబోతోంది. ఇందులో- రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక రంగాలలో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి గల మార్గాలపై చర్చిస్తారు. కీలకమైన ద్వైపాక్షిక అంశాలను సమీక్షించడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యం.
తన పర్యటనలో భాగంగా నేడు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూరకంగా కలుస్తారు.
పహల్గావ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అబ్బాస్ అరాఘ్చి భారత్‌లో అడుగు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దిరోజుల కిందటే ఆయన పాకిస్తాన్‌లో పర్యటించారు. ఆ దేశ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్‌తో సమావేశం అయ్యారు.
భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడూ అబ్బాస్ అరాఘ్చి స్పందించారు. భారత ఉపఖండంలో శాంతియుత వాతావరణం నెలకొనాల్సిన అవసరం ఉందంటూ కిందటి నెల 25వ తేదీన తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
ఉద్రిక్తతలు నెలకొన్న ఈ క్లిష్ట సమయంలో రెండు దేశాల మద్య పరస్పర అవగాహన పెంపొందించడానికి, శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టడానికి ఇరాన్ సిద్దంగా ఉందనీ అప్పట్లో ప్రకటించారు. ఆ తరువాతే అబ్బాస్.. పాకిస్తాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆ తరువాత భారత్‌కు వచ్చారు.












Click it and Unblock the Notifications