దెబ్బ కొట్టిన ఇరాన్: భారత్ లో మళ్లీ ఎల్పీజీ, ఆయిల్ క్రైసిస్?

అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. స్ట్రెయిట్ ఆఫ్ హొర్ముజ్ ను మరోసారి మూసివేసింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. హోర్ముజ్ స్ట్రెయిట్ నుంచి వెళ్లే ఏ నౌకను తాము వదిలిపెట్టబోమని, దాడులు చేస్తామని ఐఆర్జీసీ హెచ్చరించడంతో ఈ మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యానికి భారీ ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామం భారత్ లో ఇంధన భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.

తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ కథనాల ప్రకారం.. ఇరాన్ అత్యున్నత సైనిక కమాండ్ ఈ జలమార్గం గుండా ఎలాంటి నౌకల రాకను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఒకవేళ ఏ నౌక అయినా ఈ ప్రాంతంలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తే, అది దాడికి గురవుతుందని హెచ్చరించింది. ఈ మార్గం గుండా వెళ్లడానికి ప్రయత్నించిన రెండు నౌకలపై దాడి చేసినట్లు సమాచారం. ఆ నౌకల వివరాలు లేదా వాటి కార్గో గురించి పూర్తి స్పష్టత రాలేదు.

Iran top joint military command Shuts Strait of Hormuz vessels warned to avoid passage or face shot

తమ అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతీకాంగా అమెరికా రెండు రోజుల కిందటే ఇరాన్ పై దాడులను తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ నుంచి ఎదురవుతున్న దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు తీసుకున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. కెష్మ్, బందర్ అబ్బాస్, సిరిక్ నగరాల్లో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. దీని తర్వాత ఇరాన్ లో అనూహ్య పరిణామాలు తలెత్తాయి. ఆ దేశం కూడా పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధపడింది. ఏ ఒత్తిడికి తలొగ్గేది లేదని అధ్యక్షుడు మసూద్ పేజెష్కియాన్ స్పష్టం చేశారు.

ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రంగంలోకి దిగింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ను సీల్ చేసింది. ఏ నౌక కూడా ఇక్కడి నుంచి వెళ్లడానికి అంగీకరించబోమని తెలిపింది. తాజా ఆంక్షలు భారత్‌ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. భారత్ తన మొత్తం ముడి చమురు దిగుమతులలో 40, ఎల్ ఎన్ జీలో 50, ఎల్‌పీజీలో 90 శాతం వరకు ఈ జలమార్గం ద్వారానే పొందుతోంది. మార్చిలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+