82మంది కొవిడ్ రోగులు బూడిదయ్యారు -కిటికీల నుంచి దూకేసిన డాక్టర్లు -ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి..

ఇరాన్ రాజధాని బాగ్దాద్ నగరంలో కొవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలిన ఘనటలో మృతుల సంఖ్య 82కు పెరిగింది. గాయపడ్డవారి సంఖ్య 110కి చేరింది. అత్యంత దారుణమైన అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలను ఇరాక్ ఇంటీరియర్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి ఖలీద్ అల్-ముహన్నా, ఇరాక్ మానవ హక్కుల సెమీ అఫిషియల్ హై కమిషన్ సభ్యుడు అలీలు మీడియాకు వివరించారు..

 అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

బాగ్ధాద్ సిటీ దక్షిణ ప్రాంతంలో దియాలా బ్రిడ్రి సమీపంలో గల ఇబ్న్ ఖతీబ్ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ పేలుడు సంభవించింది. పూర్తిగా కొవిడ్ రోగులతో నిండి ఉన్న ఆ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 82 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 110 మంది గాయపడ్డారు.

 కాలిబూడిదైన శవాలు..

కాలిబూడిదైన శవాలు..

ఆక్సిజన్ ట్యాంక్ పేలిన వెంటనే ఆస్పత్రిలోని అన్ని అంతస్తులకూ మంటలు వ్యాపించాయి. ఎటూ దారి పోలుపోని స్థితిలో లోపలున్న కొవిడ్ రోగులు, డాక్టర్లు కిటికీల్లో నుంచి కిందికి దూకేశారు. ఇంకొందరు వ్యక్తులు లోపలున్న తమ బంధువులను రక్షించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టారు. కొందరు రోగులు ఊపిరి ఆడకపోవడంతో మరణించగా, చాలా వరకు శవాలు మంటల్లో పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరాయి.

 ఘోర విషాదం..

ఘోర విషాదం..

రెండు దశాబ్దాలుగా యుద్ధ పరిస్థితులను ఎదుర్కొన్న ఇరాన్ లో కరోనా విలయం తర్వాతే ఆస్పత్రుల్లో కొద్దిగైనా సౌకర్యాలు పెరుగుతూ వచ్చాయి. బద్దాద్ లోని ఖతీబ్ ఆస్పత్రిని పూర్తిస్థాయి కొవిడ్ కేర్ సెంటర్ గా మార్చి, అత్యవసర మందులు, ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించారు. కానీ ఊహించని రీతిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి 82 మంది చనిపోవడం విషాదంగా మారింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా నిరోధించేందుకు అన్ని ఆసుపత్రులను తనిఖీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇరాన్ లో ఇప్పటిదాకా నమోదైన మొత్తం 10,25,288 కేసులు నమోదుకాగా, 15,217 మరణాలు సంభవించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+