Railways: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఐఆర్సీటీసీ..!
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వేలు ప్రయాణానికి ముందు అడ్వాన్స్ బుకింగ్ కోసం ప్రస్తుత కాల పరిమితిని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. ఇందులో ప్రయాణ తేదీని మినహాయించారు. ఇక ప్రయాణికులు రైలు టిక్కెట్లను 60 రోజుల ముందుగానే బుక్ చేసుకోగలరు. గతంలో ఇది
120 రోజులుగా ఉంది. ఈ కొత్త నిబంధన నవంబర్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని భారతీయ రైల్వే ప్రకటించింది.
"01.11.2024 నుంచి అమల్లోకి వచ్చేలా, ARP 60 రోజులు (ప్రయాణ రోజు మినహా) ఉంటుంది. తదనుగుణంగా బుకింగ్‌లు చేసుకోవాలి" అని లేఖలో పేర్కొంది.
అయితే, 60 రోజుల ARP కంటే ఎక్కువ చేసిన బుకింగ్ రద్దు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కొన్ని రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ సమయం 120 రోజుల కంటే తక్కువగా ఉంది. తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ కాలం తక్కువగా ఉంది. 120 రోజుల ARP కింద 31.10.2024 వరకు చేసిన అన్ని బుకింగ్‌లు అలాగే ఉంటాయి.

చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారికి ఇప్పటికే తత్కాల్ బుకింగ్ ఉంది. ఈ టిక్కెట్లను ప్రయాణానికి ఒకరోజు ముందు బుక్ చేసుకుంటారు. ఏసీ ప్రయాణానికి ఉదయం 10 గంటలకు నాన్ ఏసీకి 11 గంటలకు తత్కాల్ బుకింగ్ ఉంటుంది. ఐఆర్సీటీసీ తన రీఫండ్ విధానాలను కూడా సవరించింది. ధృవీకరించిన టిక్కెట్‌లను రద్దు చేసే ప్రయాణికులు రద్దు ఛార్జీలను తీసివేసిన తర్వాత రీఫండ్ పొందనున్నారు. అయితే రైలు బయల్దేరే నాలుగు గంటల ముందు కన్ఫర్మ్ చేసిన టిక్కెట్‌ను రద్దు చేస్తే ఎలాంటి వాపసు
ఐఆర్సీటీసీ తన ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా రెడీ చేస్తోంది. ప్రయాణికులు ఇప్పుడు వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ని ఉపయోగించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. PNR స్థితిని సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications