IRCTC.. అదిరిపోయే ఊటీ ప్యాకేజ్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుండటంతో నాలుగు రోజులు సరదాగా చల్లటి ప్రదేశానికి టూర్ పెట్టుకుందామా? అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఇటువంటివారిని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తమిళనాడులోని ఊటీకి ఒక ప్యాకేజ్ అందుబాటులోకి తెచ్చింది. దక్షిణాదిలో మనకు దగ్గరగా, అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే ఉత్తమ పర్యాటక ప్రాంతంగా ఊటీకి గుర్తింపు ఉంది. IRCTC తీసుకొచ్చిన ఈ టూర్ లో కూనూర్ ను కూడా కవర్ చేయొచ్చు.
చెన్నై నుంచి ఊటీ టూర్ కోసం 4 రాత్రులు, 5 పగళ్ల ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. నీలగిరి పర్వతాల నుంచి సాగే రైలు ప్రయాణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఊటీ టు ముదుమలై పేరుతో ఈ టూర్ ఉంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి నీలగిరి ఎక్స్‌ప్రెస్ (12671) ప్రయాణికులతో మొదటి రోజు రాత్రి 9.05 గంటలకు బయలుదేరుతుంది. ఉదయం 6.15 గంటలకు మెట్టుపాళయం స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఊటీ చేరుకుంటారు. తర్వాత దొడ్డబెట్ట శిఖరం, టీ మ్యూజియం, ఊటీ సరస్సు, బొటానికల్ గార్డెన్ సందర్శన ఉంటుంది.

రాత్రికి హోటల్ లో బస ఉంటుంది. తర్వాతరోజు ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని ఎలిఫెంట్ క్యాంప్, జంగిల్ రైడ్ ఉంటుంది. ముదుమలై సఫారి ఖర్చులను ప్రయాణికులే పెట్టుకోవాలి. ఈ ప్యాకేజీలో ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో పాటు IRCTC పలు సౌకర్యాలను అందిస్తోంది. మొత్తం సమాచారం IRCTC వెబ్ సైట్ లో ఉంటుంది. బుకింగ్ రూ.7900 నుంచి ప్రారంభమవుతుంది. కొచ్చి, సికింద్రాబాద్, చెన్నై నుంచి టికెట్లు బుక్ చేసేవారికి IRCTC ప్రత్యేక నెంబర్లతోపాటు ఈమెయిల్ ఐడీలను జారీచేస్తోంది. ఊటీని ఉదగమండలం అని కూడా పిలుస్తుంటారు.












Click it and Unblock the Notifications