షిరిడీకి IRCTC అదిరిపోయే ప్యాకేజ్

షిరిడీ వెళ్లాలనుకునే సాయిబాబా భక్తులకు ఐఆర్ సీటీసీ ఒక శుభవార్త చెప్పింది. ఐఆర్‌సీటీసీ టూరిజం సాయి భగవానుడు కొలువైన షిరిడీకి ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. హైదరాబాద్ నుంచి రూ.3,500 లోపే షిరిడీకి ట్రైన్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. సాయి సన్నిధి పేరుతో 2 రాత్రులు, 3 పగళ్లు ఉంటుంది.

ఈ టూర్ లో షిరిడితోపాటు శని సింగనాపూర్ కవరవుతుంది. ప్రతి బుధవారం ఇది అందుబాటులో ఉంటుంది. బాబాకు ఎంతో ఇష్టమైన గురువారం దర్శించుకోవచ్చు. ప్రారంభ ధర ఒకరికి రూ.3170 మాత్రమే. మొదటిరోజు హైదరాబాద్ లో ప్రారంభమవుతుంది. ప్యాకేజీ తీసుకున్న పర్యాటకులు సాయంత్రం 6.50 గంటలకు అజంతా ఎక్స్ ప్రెస్ ఎక్కాలి. తర్వాత రోజు నాగర్ సోల్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అనంతరం పర్యాటకులను అక్కడి నుంచి షిరిడీకి తీసుకువెళతారు. భక్తులు తమ సొంత ఖర్చులతోనే షిరిడీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది.

 shiridisai-

షిరిడీలో దర్శనం పూర్తయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు శని సింగనాపూర్ బయలుదేరాలి. అక్కడి శనిదేవుడి ఆలయాన్ని దర్శించుకొని తిరిగి నాగర్ సోల్ రావాల్సి ఉంటుంది. రాత్రి 9.20 గంటలకు నాగర్సోల్ స్టేషన్‌లో రైలు ఎక్కితే తర్వాతరోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

 irctc

ప్యాకేజీ ధరలు చూస్తే స్టాండర్డ్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.3,170, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.3,700, కంఫర్ట్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.4,860, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.5,390 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, టిఫిన్, బ్రేక్‌ఫాస్ట్, ప్రయాణ బీమా కవరవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+