• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ-షాలకు బిగ్ షాక్: గెలిచిన ఆనందం ఆవిరి: బీజేపీలో చీలిక: సొనొవాల్‌కు నీళ్లొదులుతారా?

|

గువాహటి: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం.. క్లియర్ పిక్చర్. ఎక్కడా హంగ్ అసెంబ్లీ లేదు. క్యాంప్ రాజకీయాలు, రిసార్ట్ రాజకీయాలు చోటు చేసుకోలేదు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, వేరే నగరాలకు తరలించాల్సిన దుస్థితీ రాలేదు. క్లియర్ మండేటరి ఇచ్చారు ఓటర్లు. తాము ఏ పార్టీని అధికారంలోకి కూర్చోబెట్టాలనుకున్నారో.. అదే పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. అయిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అప్పగించారు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇదే పరిస్థితి.

మోడీ సర్కార్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్‌: ఢిల్లీ హైకోర్టుకు కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంమోడీ సర్కార్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్‌: ఢిల్లీ హైకోర్టుకు కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం

కొత్త ప్రభుత్వాలు కొలువుదీరినా..

కొత్త ప్రభుత్వాలు కొలువుదీరినా..

ఈ అయిదింట్లో- మూడు చోట్ల కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఎన్నికల వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని పరుగులెత్తిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఈ నెల 5వ తేదీ నాడే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా తమిళనాడు, పుదుచ్చేరిల్లో ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. తక్షణ ప్రాధాన్యతలపై దృష్టి కేంద్రీకరించారు.

అస్సాం, కేరళ మాటేమిటీ?

అస్సాం, కేరళ మాటేమిటీ?

అస్సాం, కేరళల్లో కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కావాల్సి ఉంది. కేరళ ముఖ్యమంత్రిగా అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)ను వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారు పినరయి విజయన్. ఇప్పటికే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నెల 17వ తేదీ తరువాత కేరళలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌నే కొనసాగించాలా? లేదా? అనే అంశంపై కమ్యూనిస్టు నేతలు మంతనాలు సాగిస్తున్నారు. పొలిట్‌బ్యురో భేటీ తరచూ సమావేశమౌతోంది. కమ్యూనిస్టుల నిర్ణయం ఏమిటనేది ఈ నెల 17వ తేదీన వెలువడుతుంది.

అస్సాంలో ఎందుకు జాప్యం..

అస్సాంలో ఎందుకు జాప్యం..

అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఎన్నికల ఫలితాలు వెలువడి శుక్రవారం నాటికి అయిదు రోజులైంది. ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదక్కడ. లెక్కలు సరి చూసుకోవడానికి అక్కడ హంగ్ అసెంబ్లీ లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంపూర్ణ మెజారిటీ కమలనాథులకు ఉంది. 126 స్థానాలు ఉన్న అస్సాం అసెంబ్లీలో బీజేపీకి 124 సీట్లు దక్కాయి. అయినప్పటికీ- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ వెనుకాడుతోందంటే.. అనూహ్య పరిణామాలు నెలకొంటున్నట్లే. అస్సాం బీజేపీలో ఇంటిపోరు తలెత్తడమే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది.

సొనొవాల్ వర్సెస్ హిమంత

సొనొవాల్ వర్సెస్ హిమంత


శర్బానంద సొనొవాల్‌కు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి బీజేపీ నాయకులు ఎంత మాత్రమూ అంగీకరించట్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అస్సాం బీజేపీ రెండుగా చీలిందని అంటున్నారు. వైద్య, ఆరోగ్యం, ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ వర్గీయులు..సొనొవాల్‌ను ముఖ్యమంత్రిగా అంగీకరించలేకపోతోన్నారని తెలుస్తోంది. సొనొవాల్‌కు బదులుగా ఈ సారి హిమంతకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అటు ఆర్థిక మంత్రిత్వ శాఖను, ఇటు వైద్య, ఆరోగ్య రంగాన్ని హిమంత బిశ్వ శర్మ సమర్థవంతంగా నిర్వహించారని, ముఖ్యమంత్రి పదవికి ఆయనే అర్హుడని భావిస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి బీజేపీకి..

కాంగ్రెస్ నుంచి బీజేపీకి..


హిమంత బిశ్వ శర్మ.. నిజానికి బీజేపీ నాయకుడు కాదు. ఆయన కాంగ్రెస్ నాయకుడు. సుదీర్ఘకాలం పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2015లో పార్టీ ఫిరాయించారు. బీజేపీలో తీర్థాన్ని పుచ్చుకున్నారు. 2016 నాటి ఎన్నికల్లో పోటీ చేశారు. ఘన విజయాన్ని అందుకున్నారు. సొనొవాల్ కేబినెట్‌లో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సమర్థుడైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడదే ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారింది. హిమంత వంటి నాయకుడి అండ సొనొవాల్‌కు లేకపోయి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవంటూ ఆయన వర్గీయులు కుండబద్దలు కొడుతున్నారు. ఈ పరిణామాలతో బీజేపీ అధిష్ఠానం- అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై మల్లగుల్లాలు పడుతోందని, అందుకే జాప్యం నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

English summary
It has been three days, the results of the Assam elections 2021 for the 126-member 15th Assam Legislative Assembly has been announced. Debate is raging on and speculation is rife that this time it could be the state's Minister Himanta Biswa Sarma could replace the CM Sarbananda Sonowal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X