అది మాస్కా.. గడ్డమా?.. సురేష్ గోపి లుక్‌పై వెంకయ్యనాయుడు జోకులు !!
రాజ్యసభలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మలయాళం హీరో, బీజేపీ ఎంపీ సురేష్ గోపి మధ్య హాస్య సన్నివేశం జరిగింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ.. సభలో నవ్వులు పూయించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈనెల 24న రాజ్యసభలో ఈ సన్నివేశం జరిగింది.
A lighter moment in the Rajya Sabha pic.twitter.com/lQH5g0wO4U
— Mohamed Imranullah S (imranhindu) March 27, 2022
మాస్కా.. లేక గడ్డమా?
అసలేం జరిగిందంటే.. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సురేష్ గోపికి తన రాష్ట్రంలో సమస్యలను రాజ్యసభ దృష్టికి తీసుకువచ్చేందుకు అవకాశం వచ్చింది. దీంతో ఆయన లేచి మాట్లాడుతుండగా.. ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆయన వైపు ఆశ్చర్యంగా చూశారు. సురేష్ గోపి గడ్డాన్ని చూసి.. గందరగోళానికి గురయ్యారు. అయోమయంలో పడిన వెంకయ్య.. అది మాస్కా.. లేక గడ్డమా? అని అని అడిగారు. దీంతో అది తన గడ్డం అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తన తదుపరి సినిమా కోసం న్యూలుక్ సార్ అంటూ ఛైర్మన్‌కు సురేష్ గోపి వివరించారు. తన ప్రసంగాన్ని కొనసాగించాలన్నారు ఆయనకు వెంకయ్య సూచించారు.
సురేష్ గోపి న్యూలుక్‌పై నవ్వులు..
ఈ ఆసక్తికర సన్నివేశంపై సభ్యులంతా నవ్వులు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వెంకయ్య నాయుడి సెన్స్ ఆప్ హ్యూమర్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సురేష్ గోపి పప్పన్ సనిమాలో నటిస్తున్నారు. దీనికి జోషి దర్శకుడు వహిస్తున్నారు. ఏడేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రంలో సురేష్ గోపి తనయుడు గోకుల్ సురేశ్ కూడా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత సురేష్ గోపి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.

3 దయనీయంగా గిరిజనుల పరిస్థితి
రాజ్యసభ్యలో సురేష్ గోపి మాట్లాడుతూ.. కేరళలో గిరిజనుల పరిస్థితి అత్యంత దయనీయగా ఉందని పేర్కొన్నారు. గిరిజన కమిషన్‌ను రాష్ట్రానికి పంపాలని కోరారు. కేంద్రం అంధిస్తున్న పథకాలు కూడా ప్రజలకు సక్రమంగా అందడం లేదని పేర్కొన్నారు. ప్రజలకు తాగునీరు, కరెంటు కూడా అందుబాబులో లేదని సభలో ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications