జియో ఎఫెక్ట్: రోమింగ్ ఛార్జీల రద్దుకు ముందుకు వచ్చిన చైనా ఆపరేటర్లు
రిలయన్స్ జియో ఎపెక్ట్ దేశీయ కంపెనీలనే కాదు విదేశీ టెలికం ఆపరేటర్లకు కూడ ఇబ్బందిని కల్గిస్తోంది. దేశీయ టెలికం ఆపరేటర్లు తమ టారిఫ్ రేట్లను తగ్గించగా, చైనాకు చెందిన ముగ్గురు ఆపరేటర్లు కూడ దేశీయ రోమింగ్
న్యూఢిల్లీ:రిలయన్స్ జియో తో మూడు చైనామొబైల్ ఆపరేటర్లు దేశీయ రోమింగ్ ఛార్జీలను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకొన్నాయి.గ్రూప్ స్పెషల్ మొబైల్ అసోసియేషన్ ఈ విషయాన్ని ప్రకటించింది.ఇప్పటికే దేశీయ టెలికం కంపెనీలు తమ టారిఫ్ ధరల్లో మార్పులు చేర్పులు చేశాయి.
రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశించడంతో దేశీయ టెలికం కంపెనీలు తమ టారిఫ్ రేట్లలో మార్పులు చేర్పులు చేశాయి. ఈ మేరకు తమ కస్టమర్లు జియో వైపుకు మరలకుండా ఉండేందుకు వీలుగా ఉచిత ప్లాన్ వైపుగా దేశీయ కంపెనీలు టారిప్ ప్లాన్లు మార్చాయి.
ఇండియాలో అతి పెద్ద నెట్ వర్క్ ఎయిర్ టెల్ ఉచిత ఆఫర్లను తన కస్టమర్లకు ప్రకటించింది. ఐడియా, వోడాఫోన్ లు కూడ తమ కస్టమర్ల కోసం ఉచిత ఆఫర్లను ప్రకటించాయి.
అయితే రిలయన్జ్ జియో దెబ్బకు అన్ని టెలికం కంపెనీలు తమ టారిఫ్ లలో మార్పులు చేర్పులు చేయల్సిన పరిస్థితులు అనివార్యంగా నెలకొన్నాయి.అయితే ఈ ప్రమాదం ఇంకా కన్పిస్తోంది.

జియో దెబ్బకు దిగొచ్చిన చైనా ఆపరేటర్లు
రిలయన్స్ జియో దెబ్బకు దేశీయ టెలికం కంపెనీలు తమ టారిఫ్ ప్లాన్లలో మార్పులు చేర్పులు చేశాయి.అయితే తాజాగా మూడు చైనాకు చెందిన మొబైల్ ఆపరేటర్లు కూడ టారిఫ్ లలో మార్పులు చేర్పులకు సిద్దమయ్యాయి.దేశీయ రోమింగ్ ఛార్జీలు రద్దు చేయడానికి నిర్ణయించుకొన్నాయి. ఈ మేరకు మొబైల్ అసోసియేష్ ప్రకటన కూడ చేసింది.దేశీయ రోమింగ్ చార్జీలపై తామిచ్చిన పిలుపుకు చైనా ప్రముఖ ఆపరేటర్ల నుండి అద్భుతమైన మద్దతు లభించిందని టెలికం మార్కెట్ అధ్యక్షుడు సునీల్ మిట్టల్ చెప్పారు.

అక్టోబర్ నుండి ఇంటర్ ఫ్రావిన్స్ రోమింగ్ ఛార్జీలు రద్దు
చైనా యునైటెడ్ నెట్ వర్క్ కమ్యూనికేషన్స్ గ్రూప్ ఈ ఏడాది అక్టోబర్ నుండి ఇంటర్ ఫ్రావిన్స్ రోమింగ్ చార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.బిల్లుల భారాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారుడికి సౌలభ్యంతో పాటు ప్రోత్సాహాన్ని అందించనున్నట్టు చెప్పారు. ఇతర దేశాల్లోని వివిధ ఆపరేటర్లు కూడ చైనాను ఆదర్శంగా తీసుకోవాలని సునీల్ మిట్టల్ కోరారు.

జియో ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా స్పెషల్ ప్యాక్ లు
ఏప్రిల్ 1వ, తేది నుండి జియో దాని సేవలకు చార్జీలను ప్రారంభించనున్నాయి. ఇవి ప్రీ పెయిడ్ వినియోగదారులకు రూ.19 , పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు రూ.149 నుండి ప్రారంభం కానున్నాయి. జియో ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్ల ద్వారా స్పెషల్ ప్యాక్ లను ప్రకటించింది.అయతే ఏప్రిల్ 1వ, తేది నుండి ఎయిర్ టెల్ నేషనల్ రోమింగ్ చార్జీలను రద్దు చేస్తోంది.

అంతర్జాతీయ రోమింగ్ చార్జీలను 90 శాతం తగ్గింపు
అంతర్జాతీయ రోమింగ్ చార్జీలను ఎయిర్ టెల్ సుమారు 90 శాతం వరకు తగ్గించనుంది. నేషనల్ ఇన్ కమింగ్ రోమింగ్ చార్జీ ప్రస్తుతం ఒక నిమిషానికి 45 పైసలు వసూలు చేస్తుండగా, అవుట్ గోయింగ్ కాల్స్ , చార్జీలు రద్దు కానున్నాయి.గ్లోబల్ టెలికం పరిశ్రమకు సునీల్ మిట్టల్ చైర్మెన్ గా ఉన్నారు. గత ఏడాది ఆయన బాద్యతలను స్వీకరించారు. గ్లోబల్ టెలికం పరిశ్రమకు చైర్మెన్ గా ఎన్నికైన తొలి భారతీయుడు మిట్టల్.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications