వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరవింద్ కేజ్రీవాల్: రాజ్ నారాయణ్, ఎన్టీఆర్‌లతో పోలిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Is Kejriwal a new Raj Naraian?
న్యూఢిల్లీ: మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేసిన షీలా దీక్షిత్‌ను ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఆయనను పలువురు నేతలతో పోలుస్తున్నారు. 1977లో రాజ్ నారాయణ్ దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీని రాయ్‌బరేలీ నుండి ఓడించారు.

ఇప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఊడ్చిపెట్టడమే కాకుండా స్వయంగా షీలా దీక్షిత్‌ను న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుండి ఓడించడం గమనార్హం.

ఇక మన రాష్ట్రంలో కొందరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు, కేజ్రీవాల్‌కు పోలిక తెస్తున్నారు. 1983లో వెండితెరను ఏలుతున్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని చేపట్టింది. అలాగే ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో అధిక ఎంపీ సీట్లు గెలిచి పార్లమెంటులో ప్రతిపక్షంగా నిలిచిన మొదటి ప్రాంతీయ పార్టీగా సంచలనం సృష్టించింది.

అప్పట్లో బిజెపి దేశవ్యాప్తంగా రెండు సీట్లు గెలువగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 33 సీట్లు సాధించింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పార్టీని స్థాపించి గెలవకపోయినా గెలిచినంత పని చేశారు. కాంగ్రెసును మట్టికరిపించి, బిజెపికి ముచ్చెమటలు పోయించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఎఎపి 28 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే.

English summary
Arvind Kejriwal, who defeated Sheila Dikshit in the New Delhi Constituency, is nothing short of a political sensation, and his personal victory can be compared to the Maverick Raja Narain's win over Indira Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X