దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు: ఎక్కడెక్కడ? ఎప్పుడెప్పుడు?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత కాస్తంత తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి- దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు పడటానికి ఆస్కారం ఉంది. మహారాష్ట్రలోని విదర్భ నుంచి తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వారు ట్వీట్ చేశారు. విదర్భ మీదుగా ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చని పేర్కొన్నారు.
విదర్భ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంత ఉపరితలంలో అల్పపీడనం తరహా వాతావరణం నెలకొని ఉందని, ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. వచ్చే అయిదు రోజుల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వేగంత ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. 10వ తేదీన విదర్భ, ఛత్తీస్‌గఢ్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. 12, 13 తేదీల్లో కేరళ, మాహె, కర్ణాటక కోస్తా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు.

ఆ తరువాత ఎండ తీవ్రత పెరగడానికీ అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణ సహా దక్షిణాదిన పలు చోట్ల ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి ప్రభావం తరువాత.. ఎండ తీవ్రత మరింత పెరిగొచ్చని అధికారులు చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీల మేర అధికంగా గరిష్ఠంగా ఉష్ణోగ్రత రికార్డవుతుందని పేర్కొంటున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకూ ఎండ తీవ్రత కొనసాగుతుందని వెల్లడించారు. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అంచనాలను కొట్టిపారేయలేమని స్పష్టం చేస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications