నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2 బ్రిటన్ ఉపగ్రహాలు నింగిలోకి: పీఎస్ఎల్వీ కౌంట్‌డౌన్ షురూ

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఆదివారం రాత్రి 10.08 గంటలకు నింగిలోకి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి42ని పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోగం.

ఈ ప్రయోగం ద్వారా బ్రిటన్‌కు చెందిన నోవాసర్‌, ఎస్‌1-4 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెడతారు. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శనివారం మధ్యాహ్నం 1.08 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 33 గంటలపాటు కొనసాగిన తర్వాత పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లనుంది.

 ISRO to Launch Two Earth Observation Satellites From Sriharikota Today

నోవాసర్‌, ఎస్‌1-4 ఉపగ్రహాలకు సర్వే శాటిలైట్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ సంస్థ రూపకల్పన చేసింది. ఇవి రెండూ భూపరిశీలన ఉపగ్రహాలు. సుదీర్ఘ విరామం తర్వాత ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ42 ప్రయోగం చేపట్టింది.

కాగా, శుక్రవారం సాయంత్రానికే ఇస్రోలోని అన్ని కేంద్రాల సంచాలకులు, సీనియర్‌ శాస్త్రవేత్తలు షార్‌కు చేరుకున్నారు. కౌంట్‌డౌన్‌ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం రాత్రి 10.08గంటలకు ఈ ప్రయోగం తుది దశకు చేరుతుంది.

English summary
ఈ ప్రయోగం తుది దశకు చేరుతుంది.The 33-hour countdown for the launch of two earth observation satellites on-board PSLV from the space port of Sriharikota, about 110 kilometers from here, began at 1.08 pm on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X