నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతం (ఫోటోలు)

హైదరాబాద్: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేష్ సెంటర్ (షార్) నుంచి గురువారం ఉదయం 9:30 గంటలకు జీఎస్ఎల్‌వీ మార్క్ - 3 నింగిలోకి దూసుకెళ్లింది. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేందుకు 20 నిమిషాల సమయం పట్టింది. 3,745 కిలలో బరువు, 43.43 మీటర్ల ఎత్తు ఉన్న వ్యోమగాముల గదిని అంత్యరిక్షంలోకి తీసుకెళ్లింది జీఎస్ఎల్‌వీ మార్క్ - 3.

వ్యోమగాముల గదిని 126 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్లి అండమాన దీవుల సమీపంలోని సముద్రంలోకి దిగనుంది. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ భూమికి చేరుకోనుంది. అండమాన్‌కు సమీపంలోని సముద్రం వద్ద దీనిని తీసుకునేందుకు ఇస్రో ప్రత్యేక ఏర్పాటు చేసింది.

నింగిలోకి వెళ్లిన ఈ రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూడ మాడ్యూల్ (వ్యోమగాముల గది)ను అమర్చినట్లు ఇస్త్రో శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తం జీఎస్ఎల్‌వీ మార్క్ - 3 రాకెట్ బరువు 630.58 టన్నులు. ఇది కేవలం ప్రయోగాత్మకమైనదేనని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ ప్రయోగానికి రూ. 155 కోట్ల వ్యయం అయిందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంత్యరిక్షంలోకి పంపే క్రమంలోనే జీఎస్ఎల్‌వీ మార్క్ - 3ని ప్రయోగించింది. ఈ కార్యక్రమంలో ఇస్త్రో ఛైర్మన్ రాధాకృష్ణన్, షార్ డైరెక్టర్ ప్రసాద్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో హర్షం వ్యక్తం చేసింది.

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు

జీఎస్ఎల్‌వీ మార్క్ - 3 రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. "జీఎస్ఎల్‌వీ మార్క్ - 3 రాకెట్ ప్రయోగం విజయవంతం అయినందుకు సంతోషం. ఈ విజయానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందలు" అంటూ ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం ఉదయం 9:30 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్-3 నింగిలోకి దూసుకెళ్లింది.

 నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

వ్యోమగాముగ గదిని 126 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్లి... అండమాన్ దీవుల్లో సమీపంలో సముద్రంలోకి దిగనుంది. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ తిరిగి భూమికి చేరుకోనుంది. అండమాన్ కు సమీపంలోని సముద్రం వద్ద దీనిని తీసుకునేందుకు ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

 నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

ఇది కేవలం ప్రయోగాత్మకమైనదేనని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రయోగానికి రూ.155 కోట్ల వ్యయం అయ్యిందని స్పష్టం చేశారు.

 నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

ఎల్‌వీఎం-3 రాకెట్ పయనంలో దాని చుట్టూ ఉండే సంక్లిష్ట వాతావరణాన్ని అధ్యయనం చేయడం

 నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

రాకెట్ నుంచి విడిపోయే వ్యవస్ధలన్నింటినీ ప్రయోగపూర్వకంగా పరిశీలించడం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+