ISRO OneWeb India-1: 36 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఎల్‌వీఎం3
అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3(ఎల్వీఎం3-ఎం2) రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం అర్ధరాత్రి 12.07 గంటలకు రాకెట్ జీఎస్‌ఎల్వీ-మార్క్ 3ను ప్రయోగించింది.
LVM3 M2/OneWeb India-1 mission is completed successfully. All the 36 satellites have been placed into intended orbits. @NSIL_India @OneWeb
— ISRO (@isro) October 22, 2022
ఈ రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలు కక్షలోకి చేర్చింది. 19 నిమిషాల 7 సెకన్లలో ఈ ప్రయోగం పూర్తయింది. జీఎస్‌ఎల్వీ-మార్క్ 3 (ఎల్వీఎం3-ఎం2) ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలంతా హర్షధ్వానాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో ఛైర్మన్ కూడా శాస్త్రవేత్తలందరికీ అభినందలు తెలియజేశారు.

కాగా, ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ శుక్రవారం అర్ధరాత్రి 12.07 గంటలకు ప్రారంభమైంది. అన్నీ సజావుగా సాగడంతో శనివారం (అక్టోబర్ 22,2022) అర్ధరాత్రి 12.07 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రైవేట్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ వన్‌వెబ్‌కి చెందిన 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్లను ఈ రాకెట్ ద్వారా రోదసిలోకి పంపింది. కాగా, ఈ ప్రయోగం కమర్షియల్ శాటిలైట్ రంగంలో మరో ముందడుగుగా చెప్పవచ్చు. తొలిసారి ప్రపంచ వాణిజ్య విపణిలోకి భారత్ అడుగుపెట్టినట్లయింది.
అంతకుముందు..
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరీ దేవి ఆలయంలో ఇస్రో చైర్మర్ సోమనాథ్ శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగానికి కౌంట్ డౌన్ సజావుగా సాగుతోందని చెప్పారు.
శని1వారం అర్ధరాత్రి జీఎస్ఎల్వీ మార్క్ 3 అంతరిక్షంలోకి దూసుకెళుతుందని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి పూజలు చేసినట్లు వివరించారు. యూకేకు చెందిన 108 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని, అందులో భాగంగానే ప్రస్తుతం 36 ఉపగ్రహాలను పంపిస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఈ ప్రయోగం తర్వాత వరుసగా రాకెట్ ప్రయోగాలు చేపడతామన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు మరో నాలుగు రాకెట్లను ప్రయోగిస్తామని ఆయన తెలిపారు.
-
అలిపిరితో పాటు తిరుమలలో -
Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications