2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి, స్పేష్ స్టేషన్ కూడా: ఇస్రో చీఫ్ సోమనాథ్
చంద్రయాన్-3 చరిత్రాత్మక విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRo) మరో కీలక ప్రాజెక్టుకు సిద్ధమైంది. 2040 నాటికి చంద్రునిపైకి తొలిసారిగా భారత వ్యోమగాములను పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మిషన్ కోసం భారత్‌కు చెందిన వ్యోమగాములను పంపించేందుకు రెడీ అవుతోందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఈ మేరకు మనోరమ ఇయర్ బుక్ 2024 వారికి ఇచ్చిన ఇంటర్య్యూలో పేర్కొన్నారు.
2040 నాటికి వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలన్న లక్ష్యంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన నలుగురు పైలట్లను వ్యోమగాములుగా శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేసినట్టు ఇస్రో అధిపతి సోమనాథ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యోమగాములు గగన్‌యాన్ మిషన్ కింద బెంగళూరులో ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో శిక్షణ పొందుతున్నట్లు సోమ్‌నాథ్ తెలిపారు.

భూమికి సమీపంగా ఉండే దిగువ కక్ష్యలోకి ఇద్దరు లేదా ముగ్గురు వ్యోమగాములను పంపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సోమనాథ్ వివరించారు. అంతరిక్షంలో వారు మూడు రోజులు గడిపాక సురక్షితంగా భూమికి తిరిగి వస్తారని పేర్కొన్నారు. గతవారం విడుదలైన మనోరమ ఇయర్ బుక్ 2024లో ఈ వివరాలను ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు.
2025 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్‌ను ప్రారంభించాలని ప్రధాని మోడీ అత్యంత ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించారని సోమనాథ్ వివరించారు. ప్రపంచ అంతరిక్ష వేదికపై భారత ఉనికి మరింత పటిష్ఠం కావడానికి వీలుగా శుక్ర, అంగారక గ్రహాలపై అన్వేషణ ప్రారంభించాలని ప్రధాని మోడీ లక్షాలను నిర్దేశించారని సోమనాథ్ తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమం రానున్న సంవత్సరాల్లో ఉన్నత శిఖరాలకు చేరగలదని సోమనాథ్ ధీమా వ్యక్తం చేశారు.
కాగా, గగన్‌యాన్ మిషన్‌లో వ్యోమగాములను సురక్షితంగా గగనంలోకి పంపగలిగే కీలకమైన సాంకేతిక వ్యవస్థ వ్యోమనౌక (HLV M3)లో ఉంది. ఈ ఆర్బిటల్ మోడ్యూల్‌లో క్రూ మోడ్యూల్(CM)సర్వీస్ మోడ్యూల్ (SM), ప్రాణాధార వ్యవస్థలు ఉన్నాయి. అయితే గగన్‌యాన్‌కు ముందు ఇస్రో ఎయిర్‌డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, వ్యోమనౌకపై ప్రయోగాలతోపాటు రెండు మానవ రహిత ప్రయోగాలు (జీ1, జీ 2) కూడా చేపట్టనుంది. ఈ దిశగా ఇప్పటికే టెస్ట్ వెహికల్ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించింది. అత్యవసర సమయాల్లో వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకోడానికి అవసరమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ (సీఈఎస్) ను పరీక్షించింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications