జయలలిత వ్యక్తిగత వైద్యుడిని విచారిస్తున్న ఐటీ శాఖ, శశికళ బంధువు, రూ. కోట్ల ఆస్తులు ఎలా !

శశికళకు సమీప బంధువు, ఐటీ దాడులువిచారణకు హాజరైన డాక్టర్ శివకుమార్, ఉక్కిరిబిక్కిరి, బినామి !జయలలిత వ్యక్తిగత వైద్యుడు, ఒక డాక్టర్ రూ. కోట్ల ఆస్తులు ఎలా సంపాధించాడు ?

చెన్నై: శశికళ సమీప బంధువు, జయలలిత వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శివకుమార్ సోమవారం చెన్నైలో ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారుల ముందు విచారణకు హాజరైనాడు. చెన్నైలోని నుంగంబాక్కంలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో హాజరైన డాక్టర్ శివకుమార్ అధికారులు వేస్తున్న ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

ఐదు రోజుల క్రితం ఆదాయపన్ను శాఖ అధికారులు డాక్టర్ శివకుమార్ ఇంటిని నకిలి తాళంతో తీయించి సోదాలు చేశారు. సోదాలు చేసిన సమయంలో డాక్టర్ శికుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఐటీ శాఖ అధికారులకు అందుబాటులో లేరు. డాక్టర్ శివకుమార్ ఇంటిలో రూ. కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

IT department grills Sasikala relativ Dr Sivakumar in Chennai

స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాల విషయంలో డాక్టర్ శివకుమార్ ను అధికారులు విచారణ చేస్తున్నారు. శశికళ సోదరుడి కుమార్తె ఉషాను వివాహం చేసుకున్న డాక్టర్ శివకుమార్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చాలకాలం వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశారు.

ఒక డాక్టర్ గా పని చేస్తున్న వ్యక్తికి రూ. కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయి ? అంటూ ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) కర్ణాటక రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి, శశికళ, టీటీవీ దినకరన్ కు అత్యంత సన్నిహితుడైన పూహళేంది సైతం సోమవారం చెన్నైలోని నుంగంబాక్కంలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో హాజరై విచారణ ఎదుర్కొంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+