అపార్ట్ మెంట్ పై కప్పులో రూ 18 కోట్ల నోట్ల కట్టలు, లిక్కర్ ఉందని వెళితే నిక్కర్ జారిపోయింది!

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పలు పార్టీల నాయకుల సందడి తారాస్థాయికి చేరింది. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా ఎన్నికల అధికారులు, ఐటీ శాఖతో పాటు సంబంధిత అధికారులు ఇప్పటికే వేల కోట్ల రూపాయల నగదు, బంగారు, విలువైన వస్తువులతో పాటు డ్రగ్స్ సీజ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు కూడా పలు చోట్లా సోదాలు చేస్తున్నారు. కర్ణాటకలోని ధారవాడ నగరంలో ఐటీ శాఖ అధికారులు నిర్వహించి సోదాల్లో ఒకే ఫ్లాట్‌లో రూ18 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. ధారవాడలోని దాసనకొప్ప క్రాస్‌ సమీపంలోని ఆర్నా రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లోని మూడో అంతస్తులో బసవరాజ్‌ దత్తా అనే వ్యక్తికి చెందిన ప్లాట్‌ నెంబర్ 303 నివాసంపై ఐడీ అధికారులు దాడులు చేశారు.

IT department officials seized Rs 18 crore cash from an apartment in Dharwada

ఈ సందర్బంలో బసవరాజ్ దత్తా ఇంటిలో ఏకంగా రూ 18 కోట్ల నోట్ల కట్టలు బయటపడటంతో ఐటీ శాఖ అధికారులు మొదట షాక్ అయ్యారు. తరువాత రూ 18 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్ మెంట్ లో భారీ మొత్తంలో అక్రమ మద్యం నిల్వ ఉంచారని ఐటీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో బసవరాజ్ దత్తా ఇంటికి ఐటీ శాఖ అధికారులు వెళ్లారు. దత్తా ఇంటిలోని బ్యాగులన్నీ తనిఖీ చేశారు. కానీ బసవరాజ్ దత్తా ఇంటిలో మద్యం ఎక్కడా కనిపించకపోవడంతో అధికారులు అపార్ట్ మెంట్ లో నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించారు.

అయితే అధికారులకు అనుమానం వచ్చి ఇంటి పైకప్పులో సోదాలు చెయ్యడం మొదలుపెట్టారు. ఆ సందర్బంలో నోట్ల కట్టలు బయటపడటంతో ఐటీ శాఖ అధికారులు షాక్ అయ్యారు. మొత్తం రూ 18 కోట్లు బయటపడటంతో ఆ డబ్బు మొత్తం అధికారులు సీజ్ చేశారు. 20 మంది ఐటీ శాఖ అధికారులు 6 వాహనాల్లో వెళ్లి బసవరాజ్ దత్తా నివాసం ఉంటున్న ప్లాట్ లో సోదాలు నిర్వహించారు. రూ. 18 కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పుడు ఆ డబ్బు ఎవరిది? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత డబ్బు ఎందుకు నిల్వ చేశారన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ బసవరాజ్ దత్తాను విచారిస్తున్నారు. ఇటీవల ఐటీ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ధారవాడ జిల్లాలోని కుందగోళ తాలూకాలోని రమణకొప్ప గ్రామంలోని ఓ ఇంట్లో రూ. 2 కోట్లకు పైగా నగదు లభ్యమైంది. నింగప్ప జాతడ్ ఇంట్లో 2 కోట్ల నగదు చిక్కడంతో ఆ నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇప్పుడు ధారవాడ సిటీలో రూ 18 కోట్ల నగదు చిక్కడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+