చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IT Hub: కోటీశ్వరుల కొంపల్లో క్యాస్ట్ ఫీలింగ్, ముఖం చూస్తే ధరిద్రం, గాలి పీలిస్తే అపచారం, రామరామ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మారుతున్న టెక్నాలజీ దెబ్బతో అందరూ వాళ్లవాళ్ల పద్దతులు మార్చుకుని నేటి కాలానికి అనుగునంగా పరుగు తీస్తున్నారు. ఐటీ హబ్ బెంగళూరులో కన్నడిగులతో పాటు దేశవిదేశాలకు చెందిన వారు నివాసం ఉంటున్నారు. బెంగళూరులో ఎక్కడ ఏ కులం వారు ఉన్నారో, ఉత్తర భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం. ఇలాంటి బెంగళూరులో కోటీశ్వరులు నివాసం ఉంటున్న విల్లాలో జరిగిన ఓ సంఘటనతో అందరూ షాక్ అయ్యారు. కోటీశ్వరులు నివాసం ఉంటున్న విల్లాలో క్యాస్ట్ ఫీలింగ్ తో ఓ మహిళను చిత్రహింసలకు గురి చేస్తున్నారని కేసు నమోదు అయ్యింది. మీరు పీల్చే గాలి మేము పీల్చకూడదు, రోజు మీలాంటి తక్కువ జాతి వారి ముఖం చూస్తే లేనిపోని ధరిద్రం అంటూ పక్క విల్లాలో ఉంటున్న వారిని దూషించారని ఆరోపణలు ఉన్నాయి. విల్లాకు విల్లాకు మద్యలో ఓ కుటుంబం తాత్కాలికంగా గొడను నిర్మించడం కలకలం రేపింది. మీరు మర్యాదగా ఇక్కడ విల్లా అమ్మేసి మాకంటికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్లిపోవాలని పక్కింటి వాళ్లు టార్చర్ పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇంతకాలం ఎంతో ఓపికగా అక్కడ మేము జీవిస్తున్నామని, వారి సూటిపోటి మాటలు తట్టుకోలేకపోతున్నామని, మీరే న్యాయం చెయ్యాలని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టడం కలకలం రేపింది. కోటీశ్వరులు నివాసం ఉంటున్న కొంపల్లో ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ బతికే ఉందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: క్లోజ్ ఫ్రెండ్స్, భర్త ఫ్రెండ్ తో ?, పోయేది ఏముందని కిలాడీ గ్రీన్ సిగ్నల్, క్లైమాక్స్ లో !Illegal affair: క్లోజ్ ఫ్రెండ్స్, భర్త ఫ్రెండ్ తో ?, పోయేది ఏముందని కిలాడీ గ్రీన్ సిగ్నల్, క్లైమాక్స్ లో !

 బెంగళూరులో ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలుసు ?

బెంగళూరులో ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలుసు ?

ఐటీ హబ్ బెంగళూరులో కన్నడిగులతో పాటు దేశవిదేశాలకు చెందిన వారు నివాసం ఉంటున్నారు. బెంగళూరులో ఎక్కడ ఏ కులం వారు ఉన్నారో, ఉత్తర భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం. తెలుగు ప్రజలు, తమిళ ప్రజలు, మలయాళీలను చాలా సులభంగా గుర్తు పట్టడానికి అవకాశం ఉంది. అయితే ఉత్తర భారతదేశానికి చెందిన వారు వారు ఏ రాష్ట్రానికి చెందిన వారో తెలుసుకోవడం చాలా కష్టం.

 కోటీశ్వరులు నివాసం ఉంటున్న విల్లాలు

కోటీశ్వరులు నివాసం ఉంటున్న విల్లాలు

బెంగళూరులోని బెళ్లందూరులో ఖరీదైన స్టీల్ వాటర్ విల్లాలు ఉన్నాయి. ఈ స్టీల్ వాటర్ విల్లాలోని విల్లా నెంబర్ 74లో హేమావతి జయరామ్ అనే మహిళ నివాసం ఉంటున్నారు. హేమావతి నివాసం ఉంటున్న పక్క విల్లాలో పశ్చిమ బెంగాల్ కు చెందిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అంబర్ మిశ్రా, రష్మీ మిశ్రా దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ విల్లాల్లో అందరూ కోటీశ్వరులే నివాసం ఉంటున్నారు.

 కులం పేరుతో ప్రతిరోజూ తిట్ల వర్షం

కులం పేరుతో ప్రతిరోజూ తిట్ల వర్షం

కోటీశ్వరులు నివాసం ఉంటున్న ఈ విల్లాలో క్యాస్ట్ ఫీలింగ్ తో హేమవాతి జయరామ్ అనే మహిళను చిత్రహింసలు ఎదురైనాయని వెలుగు చూసింది. మీరు పీల్చే గాలి మేము పీల్చకూడదు, రోజు మీలాంటి తక్కువ జాతి వారి ముఖం చూస్తే లేనిపోని ధరిద్రం మాకు తగులుకుంటుందని రష్మీ మిశ్రా కుటుంబ సభ్యులు పక్క విల్లాలో ఉంటున్న హేమావతి జయరామ్, ఆమె కుటుంబ సభ్యులను దూషించారని ఆరోపణలు ఉన్నాయి.

 ముఖం చూడకూడదని గోడ కట్టేశారు

ముఖం చూడకూడదని గోడ కట్టేశారు

హేమవాతి నివాసం ఉంటున్న విల్లాకు, రష్మీ మిశ్రా ఉంటున్న విల్లాకు మద్యలో మిశ్రా కుటుంబం తాత్కాలికంగా గొడను నిర్మించడం కలకలం రేపింది. అపార్ట్ మెంట్ నిబంధనలకు విరుద్దంగా గోడ నిర్మించారని హేమావతి ఆ విల్లాల అసోసియేషన్ నాయకులకు ఫిర్యాదు చేశారు. ఎందుకు వచ్చిన గొడవ మీరు ఎక్కడికైనా వెళ్లి నివాసం ఉంటే మీకే మంచిదికదా అంటూ వారు ఉచిత సలహా ఇచ్చారని హేమావతి ఆరోపిస్తున్నది.

 మర్యాదగా విల్లాను అమ్మేసి వెళ్లిపోండి

మర్యాదగా విల్లాను అమ్మేసి వెళ్లిపోండి

మీరు మర్యాదగా ఇక్కడ విల్లా అమ్మేసి మాకంటికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్లిపోవాలని హేమావతిని ఆమె పక్క విల్లాలో నివాసం ఉంటున్న రష్మీ మిశ్రా కుటుంబ సభ్యులు టార్చర్ పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇంతకాలం ఎంతో ఓపికగా అక్కడ మేము జీవిస్తున్నామని, రష్మీ మిశ్రా కుటుంబ సభ్యుల సూటిపోటి మాటలు తట్టుకోలేకపోతున్నామని, మీరే న్యాయం చెయ్యాలని హేమావతి బెళ్లందూరు పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టడం కలకలం రేపింది.

 ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు

ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు

హేమావతి ఫిర్యాదు మేరకు రష్మీ మిశ్రా కుటుంబ సభ్యుల మీద ఎస్పీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని, తప్పు చేసినట్లు రుజువు అయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ కిశోర్ భరణి మీడియాకు చెప్పారు. ఐటీ హబ్ లో కోటీశ్వరులు నివాసం ఉంటున్న కొంపల్లో ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ బతికే ఉందని వెలుగు చూడటం బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
IT Hub: Caste discrimination in luxurious Villa, case filed in Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X