మరో సీఎంపై ఈడీ కన్ను, ఇప్పటికే ఇద్దరు జైలుకు, స్కామ్ లో భార్య పేరు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరన్, మరో ఇద్దరు ఎంపీలను ఇదే ఏడాదిలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మనీలాండరింగ్ కేసుల్లో ఇద్దరు సీఎంలు అరెస్టు కావడం కలకలం రేపింది. ఇదే ఏడాదిలోనే ఈడీ అధికారులు ఈ సంచలన కేసులు నమోదు చేశారు. ఇద్దరు సిట్టింగ్ సీఎంలపైన కేసులు నమోదు చేసిన ఈడీ అధికారులు వారిని అరెస్టు చేసి జైలుకు పంపించడంతో ప్రతిపక్షాలు కేంద్రంలోని ఎన్ డీఏ ప్రభుత్వం పైన, బీజేపీ నాయకులపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఈడీ అధికారులు కేసులు నమోదు చేస్తారనే ఆందోళనలో ఉన్నారని సమాచారం. కర్ణాటక లోకాయుక్తలో నమోదైన కేసులను పరిశీలించి వివరాలు తెలుసుకొని సీఎం సిద్దరామయ్య పై ఈడీ అధికారులు కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ముడా స్కామ్ కు సంబంధించి సీఎం సిద్దరామయ్య, ఆయన భార్య పార్వతి, సీఎం బావ మల్లికార్జున స్వామి, సిద్ధరామయ్య బావకు భూమి విక్రయించిన ఆ భూమి మాజీ యజమాని దేవరాజ్ పైన ఇప్పటికే అధికారులు కేసులు నమోదు చేశారు.

తన సొంత నియోజక వర్గం కుప్పంలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్న అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారని తెలిసింది. కుప్పం గ్రామీణ అభివృద్దీకరణ (రెస్కో) అక్రమాలపై నమోదైన కేసులు అధికారులు తూతూ మంత్రంగా దర్యాప్తు చేస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.
సీఎం సిద్ధరామయ్య పై విచారణ చేయడానికి లోకాయుక్త పోలీసులకు అనుమతి ఇస్తూ కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లేట్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావ మల్లికార్జున స్వామి, భూ యజమాని దేవరాజుపైన కేసులు నమోదు అయ్యాయి. దేవరాజ్ అనే వ్యక్తి మైసూర్ సిటీ వెలుపల 3.16 ఎకరాల భూమిని మల్లికార్జున స్వామికి చాలా సంవత్సరాల క్రితం విక్రయించారు. 2010లో మల్లికార్జున స్వామి ఆభూమిని సీఎంసీ సిద్ధరామయ్య భార్య పార్వతికి బహుమతిగా ఇచ్చారు.

సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇప్పుడు ఈడీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య సీఎం హోదాలో ఉన్నందున లోకాయుక్త పోలీసులు కూడా ఈ కేసును సక్రమంగా దర్యాప్తు చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న ఈడీ అధికారులు ఒకటి రెండు రోజుల్లో సీఎం సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యుల పైన కేసు నమోదు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ముడా స్కామ్ లో తనపైన నమోదైన కేసులో విచారణ నిలిపివేయాలని సీఎం సిద్దరామయ్య ఇటీవల కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. సీఎం సిద్దరామయ్య పైన నమోదైన కేసుల విచారణ నిలిపివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. సెప్టెంబర్ 24వ తేదీన సీఎం సిద్దరామయ్యపై నమోదైన కేసులు దర్యాప్తు చెయ్యడానికి కర్ణాటక హైకోర్టు లోకాయుక్తకు అనుమతి ఇచ్చింది. ఆనాటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరన్ పై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లే ఈడీ అధికారులు ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications