రామేశ్వరం కేఫ్ కేసులో షాకింగ్ న్యూస్, నిందితుడు తిరుపతిలో, హైదరాబాద్ లో, పక్కా సమాచారం!
కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో నిందితుడిని గుర్తించడంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), బెంగళూరు సీసీబీ విజయం సాధించారని తెలిసింది. రామేశ్వరం కేఫ్‌లో బాంబును పెట్టి పేల్చిన వ్యక్తి కర్ణాటకలోని మల్నాడు జిల్లాలకు చెందినవాడని నిర్ధారణ అయ్యింది. ఆ రోజు బస్‌లో బెంగుళూరు వచ్చిన నిందితుడు బస్‌లోనే పక్క రాష్ట్రానికి పరారైనాడని తెలిసింది.
ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లేదా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ఉన్నాడనే సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతాలకు వెళ్లి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అనుమానితుడి గుర్తింపు పొందిన తర్వాత అతని కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ఛేదించడానికి దర్యాప్తు సంస్థలు ఫోన్ కాల్‌ల (సీడీఆర్) ధృవీకరణ ప్రక్రియను ప్రారంభించాయని ఓ అధికారి చెబుతున్నారు.

బెంగళూరు నగరంలోని కుందనహళ్లి నుంచి బళ్లారి వరకు వరుసగా మూడు రోజులుగా 800లకు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా అనుమానితుడి ఆచూకీ లభ్యమైందని అధికారులు అంటున్నారు. ఈ విచారణలో బెంగళూరు సీసీబీ ఎంతగానో కష్టపడిందని, ఎట్టకేలకు అతడి కచ్చితమైన సమాచారాన్ని రాబట్టి ఎన్‌ఐఏకి అందజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మంగళూరు కుక్కర్ పేలుడు కేసు, శివమొగ్గ జిల్లా తుంగ తీరంలో జరిగిన బాంబు పరీక్ష కేసు, తమిళనాడులోని కోయంబత్తూరు బాంబు పేలుడు, రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులు ఒకదానికొకటి సంబంధించినవి అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రామేశ్వరం కేఫ్ పేలుళ్లలో కర్ణాటకలోని మలెనాడు జిల్లాకు చెందిన వ్యక్తి పాత్ర ఉన్నట్లు ఇప్పుడు తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మంగళూరు కుక్కర్ పేలుడులో లభించిన పేలుడు పదార్థాలు, శివమొగ్గ జిల్లా బాంబు పరీక్ష బ్లాస్ట్‌లో లభించిన పేలుడు పదార్థాలు, బెంగళూరులోని రామేశ్వర్ కేఫ్‌లో బాంబుల తయారీకి సంబంధించిన పేలుడు పదార్థాలు, ఆ వస్తువులు కూడా ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయని అధికారులు అంటున్నారు. దీంతో శివమొగ్గ కేసులో తప్పించుకున్న కీలక నిందితులే రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో వారి పాత్ర ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

మార్చి 1వ తేదీన అనుమానితుడు కర్ణాటక రాష్ట్రం వెలుపల నుంచి బెంగళూరులోని కుందనహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌కు వచ్చి బాంబును అమర్చి బయటి రాష్ట్రానికి వెళ్లిపోయాడని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు సిల్క్ బోర్డ్ దగ్గర అనుమానితుడు బస్సు దిగిన దృశ్యాలు దొరికాయి. తమిళనాడు నుంచి బెంగళూరు నగరానికి వచ్చి అనుకున్నట్టుగానే రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టి తరువాత కేఎస్‌ఆర్‌టీసీ బస్సు ఎక్కి బళ్లారి వెళ్లాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది.
బళ్లారి నుంచి కలుబరిగి జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లేదా తెలంగాణలోని హైదరాబాద్‌లో నిందితుడు తలదాచుకునే అవకాశం ఉందని, మరో రెండు మూడు రోజుల్లో ఎన్‌ఐఏ నిందితుడిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసు ఓ కొలిక్కి వస్తోందని తెలిసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications