సరిసర్లే, ఎన్నెన్నో అనుకుంటాము, అన్ని జరుగుతాయా ఏంటి ?, ఎంపీ సీట్లు మిస్ అయినా వారిని మాత్రం !

లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు ముమ్మరంగా ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా ముగ్గురు నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ టిక్కెట్లు ఇచ్చింది. లోక్ సభ ఎన్నికలను టార్గెట్ చేసుకున్న అన్ని పార్టీలు ఆచితూచి రాజ్యసభ టిక్కెట్ లు ఇచ్చింది.

కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, డాక్టర్ సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక రాష్ట్రం నుంచి ముగ్గురు అభ్యర్థులను రాజ్యసభ అభ్యర్థులుగా నిలబెట్టింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సన్నిహితుల్లో నాసిర్ హుస్సేన్ ఒకరిగా గుర్తింపు పొందారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

It is the high command of that party which allocated Rajya Sabha seats with Congress brand politics

కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు సీఎం డీకే శివకుమార్‌ వర్గం అభ్యర్థిగా జీసీ చంద్రశేఖర్‌ బరిలో నిలిచారు. కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థిగా అజయ్ మాకెన్ అని తెలిసింది. కాంగ్రెస్‌ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. మళ్లీ ఇద్దరికి అవకాశం కల్పించింది. మరో స్థానం కొత్త వ్యక్తితో భర్తీ చేస్తున్నారు. కాంగ్రెస్ మళ్లీ జీసీ చంద్రశేఖర్, నాసీర్ హుస్సేన్‌లకు టిక్కెట్లు ఇచ్చింది.

ఏఐసీసీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌కు కర్ణాటక రాజ్యసభ టికెట్‌ లభించింది. కర్ణాటకలో పూర్తి మెజారిటీ కంటే ఊహించని విధంగా 135 ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 135 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లాలని చాలా మంది ప్రయత్నాలు చేశారు. కొందరు సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతుతో రాజ్యసభ సీటు సంపాధించుకోవాలని ప్రయత్నించారు.

It is the high command of that party which allocated Rajya Sabha seats with Congress brand politics

కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా చాలా మంది రాజ్యసభలో అడుగుపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అయితే చివరికి కర్ణాటక విషయంలో ఆచితూచి అన్ని రకాలుగా ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ చివరి బుధవారం రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది. ఇప్పుడు రాజ్యసభ సీటు ఆశపడి చివరి నిమిషంలో సీటు రాని వారికి నచ్చ చెప్పి లోక్ సభ ఎన్నికల్లో వారి నుంచి ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూసుకోనే బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కర్ణాటక నాయకులకు అప్పగించిందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+