శశికళ లిక్కర్ కంపెనీ మిడాస్ లో ఐటీ అధికారులు, దివాకరన్ విచారణ, 187 చోట్లు సోదాలు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కలలుకని చివరికి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు చేరిన చిన్నమ్మ శశికళ కథ త్వరలో ముగిసిపోతుందని ప్రచారం మొదలైయ్యింది. శశికళ భర్త నటరాజన్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు అందరి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.

  IT raids on Jaya TV just After 3 days of Modi-Karunanidhi meet

  శశికళ ఆర్థిక సామ్రాజ్యానికి కేంద్రబిందువుగా ఉన్న కాంచీపురం జిల్లాలోని పడపై ప్రాంతంలోని మిడాస్ మద్యం కంపెనీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మద్యం వ్యాపారంతో తమిళనాడులో చక్రంతిప్పుతూ ఇంత కాలం ఆదాయపన్ను ఎగవేశారని శశికళ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు ఉన్నాయి.

  IT Offcials Raid in Midas Distilleries in Padapai Kanchipuram District

  తమిళనాడులో అధిక శాతం మద్యం శశికళకు చెందిన మిడాస్ కంపెనీ సరఫరా చేస్తోంది. మిడాస్ కంపెనీలో అధిక శాతం వాటాలు శశికళ, ఆమె కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి. మిడాస్ కంపెనీలో అక్రమలావాదేవీలను ఆదాయపన్ను శాఖ అధికారులు బయటకులాగుతున్నారు.

  శశికళ సోదరుడు దివాకరన్ కు చెందిన సుందరకోటై ఇంటిలో సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు పలు కీలక డాక్యూమెంట్లు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. స్వాధీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించి దివాకరన్ ను ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. మొత్తం 187 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  IT Offcials Raid in Midas Distilleries in Padapai Kanchipuram District. Which is owned by Sasikala. Income tax officers inquiry in Sasikala brother Divakaran. The raids are taking place at 187 locations in Tamil Nadu, as part of the Operation Clean Money drive against untaxed wealth, a senior Income Tax official.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి