మంచం కింద అట్టబాక్స్ ల్లో రూ 42 కోట్లు, ఏం చెయ్యాలని ప్లాన్, క్లాస్ వన్ కాంట్రాక్టర్ కూతురికి షాక్ !
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ (congress) పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత అధికారానికి దూరం అయిన బీజేపీ (BJP) నాయకులు అయోమయంలో పడిపోయారు. బెంగళూరు నగరంలో ఇటీవల కాలంలో ఐటీ (IT Raids) అధికారులు దాడులు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పలు రంగాలకు చెందిన వారి మీద ఐటీ (IT)శాఖ అధికారులు దాడులు చేసి భారీ మొత్తంలో డబ్బులు, నగలు, విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారు.
గురవారం బెంగళూరు (Bengaluru) నగరంలోని పలు ప్రాంతాల్లోని బంగారు నగల వ్యాపారుల జ్యువెలరీ షోరూమ్ లు, వారి నివాసాల్లో సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు (IT Raids) విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఐటీ శాఖ (IT Raids) అధికారులు అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం బయటకు చెప్పలేదు. గురువారం అర్దరాత్రి వరకు ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగాయని తెలిసింది.

ఆర్ టీ నగర్‌లోని రెండు చోట్ల ఐటీ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహించారు. అదే సమయంలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో ఆత్మానంద కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్‌లోని ఓ గదిలో 23 అట్ట బాక్సుల్లో నింపిన 500 రూపాయల నోట్లు బయటపడ్డాయి.
అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్‌లోని బెడ్‌రూమ్‌లోని సోఫా కింద కోట్ల రుపాయల నోట్ల కట్టలు దాచారని వెలుగు చూసింది. ఏకంగా 23 అట్ట బాక్సుల్లో రూ 500 నోట్ల కట్టలు (crore) దొరికాయని, ఆత్మానంద కాలనీ నుంచి కారులో వేరే చోటికి తరలించేందుకు కొందరు సిద్ధం చేశారని ఐటీ శాఖ (IT Raids) అధికారుల అంటున్నారు. గురువారం రాత్రి ఐటీ అధికారులు దాడులు చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

అయితే బీబీఎంపీకి (BBMP) చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్ కుమార్తెకు (Daughter) చెందిన ఫ్లాట్ లోని మంచం కింద, సోఫా కింద అట్ట బ్యాక్స్ లో (box) నిల్వ చేసిన రూ 42 కోట్ల (crore) విలువైన రూ. 500 నోట్లను ఐటీ శాఖ (IT Raids) అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా ఈ డబ్బును తమిళనాడుకు తరలించడానికి ప్లాన్ చేశారని, కాంట్రాక్టర్ తో పాటు, ఆయన కుమార్తెను ఐటీ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారని ప్రముఖ కన్నడ దినపత్రిక ప్రజావాణి వార్త ప్రచురించింది. బెంగళూరు నగరంలో శుక్రవారం కూడా ఐటీ శాఖ (IT Raids) అధికారులు వివిద ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications