సమంత, నయనతార, విజయ్ ఇళ్లపై ఐటి దాడులు

చెన్నై: పులి సినిమా హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతార ఇళ్లపై ఆదాయం పన్ను (ఐటి) శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి ఈ దాడులు ప్రారంభమయ్యాయి. పులి నిర్మాత, సహాయ దర్శకుడు తదితరుల ఇళ్లపై కూడా ఐటి సోదాలు జరుగుతున్నాయి.

తమిళనాడు రాజధాని చెన్నైలోని వారి ఇళ్లలో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది. నల్లధనం పాత్ర ఏమైనా ఉండవచ్చుననే అనుమానంతో ఐటి అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

 IT raids at actors Vijay and Nayanthara’s homes

మధురై, తిరువనంతపురంల్లోని నివాసాల్లో కూడా ఐటి దాడులు దాడులు జరుగుతున్నాయి. ఐటి అధికారుల సోదాలు పూర్తయితే తప్ప వివరాలు తెలిసే అవకాశం లేదు. వారేమైనా స్వాధీనం చేసుకున్నారా, లేదా అనేది కూడా ఆ తర్వాతే తెలుస్తుంది.

చెన్నై సహా దేశ వ్యాప్తంగా 32 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. తిరువనంతపురం, కొచ్చిలోని నయనతార ఇళ్లలో, చెన్నై, హైదరాబాద్‌లోని సమంత ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. హీరో విజయ్ నటించిన 'పులి' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

నిజానికి ఈ చిత్రానికి సమంత, నయనతారలకు ఎలాంటి సంబంధం లేదు. అయినా వారి ఇళ్ళలో కూడా సోదాలు నిర్వహించడం గమనార్హం. అలాగే, 'పులి' చిత్ర నిర్మాతలు ఎస్.థమీన్స్, పీటీ సెల్వకుమార్ ఇళ్ళలో కూడా ఈ సోదాలు నిర్వహించారు. కాగా, పులి చిత్రం అక్టోబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+