చెప్పుల వ్యాపారుల ఇళ్లలో రూ. 100 కోట్ల నగదు, భారీగా ఆస్తులు: కౌంటింగ్ మెషీన్లు బేజారు
లక్నో: సార్వత్రిక ఎన్నికల వేళ తనిఖీలలో పలువురు రాజకీయ నాయకులు, వారికి సంబంధించిన వ్యక్తుల కార్యాలయాలు, నివాసాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇక, జార్ఖండ్‌లో మంత్రి పీఏ ఇంట్లో భారీగా నగదు పట్టుబడటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని వ్యాపారుల నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.100 కోట్లకుపైగా నగదు లభ్యం కావడం గమనార్హం.
ఓ చెప్పుల వ్యాపారి ఇంట్లో రెండు రోజుల నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. లభ్యమైన భారీ నగదును లెక్కించడానికి మెషీన్లు కూడా మొరాయించాయి. భారీగా నగదుతో పాటు ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు.

వ్యాపారుల ఇళ్లల్లో మంచాలు, అల్మారాలు, బ్యాగులు, షూ బాక్సుల్లో 500 రూపాయల నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. సోదాల్లో బయటపడ్డ నోట్ల కట్టలను చూసి అధికారులు కూడా షాకయ్యారు. చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో ఏ మూలన చూసినా నోట్ల గుట్టలే కనిపించాయి. నోట్లు లెక్కించలేక యంత్రాలే అలసిపోయాయంటే.. ఎంత మొత్తంలో నగదు పట్టుబడిందో అర్తం చేసుకోవచ్చు.
డబ్బుల కట్టలతో పాటు ఆక్రమార్జనకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా అధికారులు సీజ్ చేశారు. కేవలం 42 గంటల్లోనే రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన 14 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహింంచింది. రెండు రోజుల పాటు సాగిన సోదాల్లో కోట్ల కొద్దీ డబ్బును అధికారులు గుర్తించారు.
ఆ చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో డబ్బుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాల పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమాస్తులు లెక్క ఇప్పటివరకూ రూ.100 కోట్లు తేలిందని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం సోదాలు పూర్తయ్యే వరకు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వెల్లడించాయి.
కాగా, సోదాలు ప్రారంభమై రెండు రోజులు గడుస్తున్నా.. నగదు లెక్కింపు ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. మంచంపై రూ. 500 నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఇంకా, వాషింగ్ మెషీన్, గోడల్లోని రహస్య ప్రదేశాల్లో భారీగా డబ్బులు గుర్తించినట్లు సమాచారం. నోట్లు లెక్కించే యంత్రాలు వేడెక్కడం వల్ల ఇతర యంత్రాలను తెప్పించారు.
కొంతకాలంగా బీకే షూస్, మన్షు ఫుట్‌వేర్‌లో పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నారని ఆదాయపు పన్నుశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులతో ఐటీ శాఖ సోదాలు చేసింది. భూమి, బంగారంపై పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
చెప్పుల వ్యాపారి రామ్‌నాథ్‌డాంగ్ ఇంటి నుంచి ఐటీ బృందం ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు బినామీ ఆస్తుల పత్రాలను సైతం స్వాధీనం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications