వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలపైఅత్యాచారాలు జరిగాయి, నిందితులను పట్టుకోండి

ముర్తాల్ లో మహిళళపై అత్యాచారాలు జరిగాయి. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలని పంజాబ్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చంఢీగఢ్ :జాట్లను ఓ బిసిలో చేర్చాలంటూ 2016 ఫిబ్రవరిలో జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా ముర్తాల్ సమీపంలో అత్యాచారాలు చోటుచేసుకొన్నట్టుగా పంజాబ్ హర్యానా హైకోర్టు నిర్థారించింది. .

2016 ఫిబ్రవరిలో జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా కొంతమంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని కోర్టు నిర్ధారించింది. మహిళల లో దుస్తులను బట్టి అక్కడ అత్యాచారాలు జరిగినట్టు ఖరారైందని కోర్టు తెలిపింది.

ఈ కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు డివిజన్ బెంచి ఆదేశాలు జారీ చేసింది. తమ వాహనాల్లోంచి కొందరు మహిళలు నిరసన కారులు లాక్కెళ్ళిపోయారని ఓ టాక్సీ డ్రైవర్ కూడ చెప్పారని న్యాయమూర్తి తెలిపారు.

it's evidence rapes on woman in murthal find culprits orderd highcourt

ఈ ఘటనను బట్టి హైకోర్టు ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది,తర్వాత హర్యాణ పోలీసులు ఎప్ ఐఆర్ నమోదు చేశారు. తొలుత ఐదుగురిని ఈ అత్యాచారాల కేసుల్లో నిందితులుగా భావించినా, వారి రక్తనమూనాలు, ఘటనా స్థలంలో లభించిన లో దుస్తుల మీద ఉన్న వీర్య నమూనాలతో సరిపోలేదు.దీంతో వారిని వదిలేశారు.

ఈ కేు విచారణకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తగిన విశ్వాసంతో పనిచేయడం లేదని అమికస్ క్యూరీ , సీనియర్ న్యాయవాది అనుపమ్ గుప్తా ఆరోపించారు. విచారణ కొనసాగుతోందటూ అఫిడవిట్ దాఖలు చేయాలని సిట్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తుచేసేందుకు సిబిఐ సిద్దంగా ఉందో లేదో తెలియజేయాలని సిబిఐ తరపు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణ ఫిబ్రవరి 28న, జరగనుంది.

English summary
it's evidence rapes on woman in murthal, find cuprits orderd punjab high court . in 2016 feb in murthal rape incidents sensational in the country, punjab high court find rape on woman in murthal,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X