ఎవరు అందగత్తెలు?: కేరళ అమ్మాయిలా? తమిళ అమ్మాయిలా?
కేరళ అమ్మాయిలు బాగుంటారా? తమిళ అమ్మాయిలు బాగుంటారా? ఛ.. ఇదే ప్రశ్న అనుకుంటున్నారా? ఈ ప్రశ్న మేం అడగడం లేదండీ బాబూ.. ఓ తమిళ ఛానల్ అడుగుతోంది.. కావాలంటే మీరే చూడండి.
చెన్నై: కేరళ అమ్మాయిలు బాగుంటారా? తమిళ అమ్మాయిలు బాగుంటారా? ఛ.. ఇదే ప్రశ్న అనుకుంటున్నారా? ఈ ప్రశ్న మేం అడగడం లేదండీ బాబూ.. ఓ తమిళ ఛానల్ అడుగుతోంది.. కావాలంటే మీరే చూడండి.
తమిళనాడులోని స్టార్ విజయ్ ఛానల్‌లో నీయా.. నానా (నువ్వా.. నేనా) అనే కార్యక్రమం ప్రసారమవుతోంది. ఇందులో ఏదో ఒక అంశం మీద రెండు వర్గాలు చర్చించుకుంటాయి.

ఈ కార్యక్రమంలో మాట్లాడే వారి అభిప్రాయాలు చాలాసార్లు వివాదాస్పదం అవుతుంటాయి. అయితే ఈ వారం ఆ కార్యక్రమంలో ప్రసారం కానున్న అంశమే పెద్ద టాపిగ్గా మారింది.
ఇంతకీ, ఆ అంశం ఏంటంటే.... కేరళ అమ్మాయిలు బాగుంటారా? తమిళ అమ్మాయిలు బాగుంటారా? దీనికి సంబంధించిన ప్రోమోను కూడా టీవీ ఛానల్ విడుదల చేసింది. పిల్లల్ని బుజ్జగించడంలో తేడా, వేషధారణ, డ్యాన్సింగ్ స్టైల్ ఇలా కొన్ని అంశాల మీద ఇరు వర్గాల అమ్మాయిలు వాదనలు విసురుకోవడం ప్రోమోలో చూడొచ్చు.
జిమ్మిక్కీ కమ్మాల్ పాటకు డ్యాన్స్ వేసి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మలయాళ కుట్టి షెరిల్‌కి తమిళనాడు యువత అభిమానులుగా మారారు. దీంతో అక్కడి యువత తమిళ అమ్మాయిల కంటే కేరళ అమ్మాయిలే బాగుంటారని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
దీని గురించి తేల్చడానికి ఈ కార్యక్రమ నిర్వాహకులు ఈ అంశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించి స్టార్ విజయ్ ఛానల్ సోషల్ మీడియాలో పోలింగ్ కూడా ఆవిష్కరించింది. ఇప్పటికే ఈ పోల్‌కి 1000 మందికి పైగా ఓటింగ్ చేశారు.
అయితే ఇలాంటి సున్నితమైన అంశాన్ని తీసుకోవడంపై కొంతమంది నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ఉన్న భేదాలు సరిపోక, ఇలా కొత్త భేదం సృష్టించడం సబబు కాదని మందలిస్తున్నారు.
మరి కొంతమంది మాత్రం ఇదే టాపిక్‌ని మగవాళ్ల విషయంలో కూడా పెట్టాలని సూచిస్తున్నారు. ఈ వివాదాస్పద అంశానికి చివరికి ఎలాంటి సమాధానం దొరుకుతుందో తెలుసుకోవడానికి అటు కేరళ, ఇటు తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications