ఇటాలియన్ లేడీ డీజేపై ఎయిరిండియా సిబ్బంది దాడి!: ఏడుస్తూ వీడియో పెట్టిన యువతి
Recommended Video

హైదరాబాద్: తనపై దాడి చేశారంటూ ఓ ఇటాలియన్ మహిళా డీజే.. ఎయిరిండియా సిబ్బందిపై ఆరోపణలు చేశారు. విమానం ఆలస్యంపై ప్రశ్నించిన సదరు విదేశీ మహిళపై చేయిచేసుకున్నారట. దీంతో ఎయిర్ ఇండియా సిబ్బంది దురుసు ప్రవర్తనపై ఆమె ఏడుస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, తాము మాత్రం ఎలాంటి దాడులకు పాల్పడలేదని ఎయిరిండియా చెబుతోంది.

టూర్‌లో భాగంగా భారత్‌కు
ఆ వివరాల్లోకి వెళితే.. ఇటలీకి చెందిన డీజే ఓలీ ఎస్సే తన టూర్‌లో భాగంగా భారత్‌కు వచ్చింది. పర్యటన తర్వాత ఆగస్టు 19న స్వదేశానికి వెళ్లేందుకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాని(ఆర్‌జీఐఏ)కి చేరుకుంది.

విమాన ఆలస్యంపై ప్రశ్నిస్తే దాడి చేశారు..
అయితే తాను ఎక్కాల్సిన ఎయిర్ఇండియా విమానం 9 గంటలు లేట్ కావడంతో అక్కడి ఎయిర్ ఇండియా సిబ్బందిని ఆమె ప్రశ్నించింది. అక్కడే ఉన్న ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది ఒకరు ఈ సందర్బంగా డీజేతో దురుసుగా ప్రవర్తించారు. అంతేగాక, విమానం ఆలస్యంపై సరిగ్గా జవాబివ్వకుండా ఓలీపై చేయి చేసుకున్నారు. దీంతో ఈ ఘటనపై డీజే ఓలీ ఎస్సే ఆవేదన చెందుతూ ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది.

లేడీ డీజే ఆవేదన
తనపై ఎయిర్ఇండియా మహిళా సిబ్బంది ఒకరు దాడిచేశారనీ, ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు కూడా అక్కడ లేరని వాపోయింది. కాగా, ఈ ఘటనపై ఆగస్టు 19న తమకు ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సీసీటీవీతో పాటు వీడియోను పరిశీలిస్తున్నామనీ, త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అదేం లేదంటూ ఎయిరిండియా..
ఇది ఇలావుంటే, ఓలీ వాదనను ఎయిర్ఇండియా ప్రతినిధి ఖండించారు. ఓలీ ఎయిర్ఇండియా మహిళా సిబ్బందిని ప్రశ్నిస్తూ వీడియో తీసిందని, దీన్ని ఆపాల్సిందిగా మాత్రమే ఆమె కోరిందని వెల్లడించారు. చివరికి ఆ ఫోన్‌ను పక్కనపెట్టాలని వీడియో రికార్డును సదరు ఉద్యోగిని అడ్డుకుందన్నారు. ఈ ఘటనకు కారణమైన మహిళ తమ సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోందన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications