టెన్నిస్ క్రీడాకారిణిలకు వేధింపులు: ఐటీబీపీ జవాన్ల అరెస్ట్
రాయ్‌పూర్: ముగ్గురు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులను లైంగిక వేదింపులకు గురిచేసిన 29వ ఐటీబీపీ జవాన్లపై పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కోరేగావ్ ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. వీరిపై సెక్షన్ 354 ఐపీసీ, పోక్సో సెక్షన్11 , 12ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

వేధింపులకు పాల్పడిన జవాన్లను ఇప్పటికే అరెస్టు చేశారు. కొండగావ్‌లో సాధనకు వెళ్లి తిరిగి వస్తోన్న ముగ్గురు టేబుల్ టెన్నిస్ క్రీడారుల(ముగ్గురూ మైనర్లే)ను కానిస్టేబుళ్లు మనీష్ కుమార్, నాగేంద్ర భగోర్, ప్రభుదయాల్‌లు వేధింపులకు గురిచేశారు.
వీరి అరాచకంపై బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. మావోయిస్టుల ఏరివేత బాధ్యతల నిమిత్తం వీరిని ఇక్కడ నియమించారు.












Click it and Unblock the Notifications