ఇద్దరు ఉగ్రవాదుల హతం: లొంగిపోయిన మరో ఉగ్రవాది
జమ్మూకాశ్మీర్ కుల్గామ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ కుల్గామ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాదిని అరెస్ట్ చేశాయి. కుల్గామ్‌లో కొందరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు భద్రతా దళాలకు ముందస్తు సమాచారం అందింది.
దీంతో సోమవారం ఉదయం కుల్గామ్‌లోని కుడ్వాని ప్రాంతంలో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. బలగాల కదలికలతో అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీనికి స్పందనగా భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి.

ఈ కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు నేలకొరిగారు. వీరిని హిజ్బుల్‌కు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఏకే47, ఇన్సాస్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications