ప్రజలే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డ పాక్: ఇద్దరు జవాన్లు, ముగ్గురు పౌరుల మృతి
శ్రీనగర్: పాకిస్థాన్ సైన్యం జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దుల్లో వరుసగా మూడో రోజు కాల్పులు తెగబడింది. కాల్పలు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ రేంజర్లు సరిహద్దుల్లో పలు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు.
జమ్మూ, పూంఛ్ జిల్లాల్లో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు, ముగ్గురు పౌరులు మరణించారు. ఆర్‌ఎస్ పుర ప్రాంతంలో పాక్ రాత్రంతా భారీ ఎత్తున కాల్పులు జరుపుతూనే ఉందని బీఎస్‌ఎఫ్ అధికారి వెల్లడించారు.

బీఎస్‌ఎఫ్ జవాన్లు పాక్ కాల్పులను తిప్పి కొడుతున్నారని తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం అధికంగా కలిగించాలనే ఉద్దేశంతో పాక్ రేంజర్లు గ్రామాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు.
అర్నియా, రామ్‌గఢ్, సాంబా, హీరానగర్ సెక్టార్లలో శనివారం ఉదయం 5 గంటల వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నారని చెప్పారు. అఖ్‌నూర్ ప్రాంతంలో ఇద్దరు గాయపడ్డారని, ఓ బాలికకు కూడా స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. పాక్ కాల్పుల నేపథ్యంలో సుమారు 9వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మరో వెయ్యి మందికి ఆర్ఎస్ పురలో క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications